పాపాయికి అమ్మపాలు అమృతం
FILE
తల్లిపాలు తాగి పెరిగిన పిల్లల్లో స్థూలకాయం అంత త్వరగా రాదు. తల్లిపాలు మానసిక బంధానికి పనికొస్తాయట. తల్లిపాలు తాగిన పిల్లలు తల్లితో ఎంతో ప్రేమగా, నమ్రతతో ఉంటారని పరిశోధనలు చెప్తున్నాయి. పిల్లల మేధోశక్తిని పెంచగలిగినవి తల్లిపాలు.
మెదడు ఎదుగుదలతో తల్లిపాలు పాత్ర వహిస్తాయి. తల్లిపాలు తాగిన పిల్లలకు జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండి చురుకుగా ప్రవర్తిస్తారు. అంటు రోగాలు అంత త్వరగా సోకవు. బిడ్డకు ఇన్నిరకాలుగా మేలుచేస్తుంది కాబట్టి అమృతంతో తల్లిపాలును పోలుస్తారు.

