1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 13 జూన్ 2014 (10:26 IST)

గుంటూరు - విజయవాడల మధ్యే రాజధాని : చంద్రబాబు

సీమాంధ్ర ప్రాంతానికి రాజధానిని గుంటూరు - విజయవాడల మధ్యే నిర్మిద్ధామని తన మంత్రివర్గ సహచరులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ తొలి సమావేశం సాగర తీరం విశాఖలో జరిగిన విషయం తెల్సిందే. 
 
ఈ సందర్భంగా మంత్రివర్గ సహచరులతో మాట్లాడుతూ గుంటూరు నగరాల మధ్యే రాష్ట్ర రాజధానిని పెట్టాలని ఆలోచిస్తున్నామన్నారు. ఈ రెండు నగరాలు కలిస్తే అదొక పెద్ద నగరంగా ఏర్పడుతుంది. ఎవరైనా బయటి నుంచి ఇక్కడకు రావాలనుకొంటే ముందు రాజధానిని... అక్కడ ఉన్న వివిధ రకాల సౌకర్యాలను చూస్తారు. స్కూళ్ళు, కాలేజీలు, ఆసుపత్రులు, వినోద కేంద్రాల వంటివి ఉండాలి. దీనికి పెద్ద విస్తీర్ణంలో భూమి కావాల్సి ఉంటుందన్నారు. 
 
60: 40 రేషియోలో రైతుల నుంచి భూమి సేకరించి వారికి మరో చోట భూమి ఇచ్చే విధానాన్ని అమలు చేయాలని అనుకొంటున్నాం. రాజధానిని పరిపాలనా కేంద్రంగా ఉంచి రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం. కేంద్రం నుంచి కావాల్సిన సాయం అందుతుందన్న ఆశ ఉంది అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినట్టు సమాచారం.