ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

30-04-2021- శుక్రవారం మీ రాశి ఫలితాలు.. గౌరీదేవిని ఆరాధించినట్లైతే..?

గౌరీదేవిని ఆరాధించినట్లైతే మనోసిద్ధి చేకూరుతుంది. 
 
మేషం: కుటుంబీకులతో మనస్పర్థలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. పారిశ్రామికవేత్తలకు అధికారుల నుంచి సమస్యలు తలెత్తుతాయి. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం శ్రేయస్కరం. 
 
వృషభం: బంధుమిత్రుల రీత్యా కొత్త సమస్యలు తలెత్తగలవు. పండ్ల, పూల, కొబ్బరి, కూరగాయ, చల్లని పానీయ, చిరు వ్యాపారస్తులకు లాభదాయకం. ఎవరికీ పెద్దమొత్తంలో నగదు చెల్లింపు మంచిది కాదు. మీ వ్యవహార జ్ఞానం, పట్టుదల కొంతమందికి స్ఫూర్తినిస్తుంది. నూతన దంపతులు కొత్త అనుభూతికి లోనవుతారు. 
 
మిథునం: వాణిజ్య ఒప్పందాలు, లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టుల గడువు పొడిగింపునకు అనుకూలం. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. సోదరీ, సోదరులతో అనుకోని ఇబ్బందులు చికాకులను ఎదుర్కొంటారు. పత్రికా ఉద్యోగస్తులకు ఏకాగ్రత, మెళకువ చాలా అవసరం. రాజకీయ నాయకులకు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. 
 
కర్కాటకం : ఎవరికీ పెద్దమొత్తంలో నగదు చెల్లింపు మంచిది కాదు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. పెద్దల ఆరోగ్యంలో సంతృప్తి కానవస్తుంది. ఉద్యోగస్తులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెళకువ అవసరం. 
 
సింహం : అనవసరపు విషయాలలో ఉద్రేకం మాని తెలివితేటలతో ముందుకు సాగి జయం పొందండి. ఏమాత్రం ధనం నిల్వ చేయలేకపోతారు. స్త్రీలకు బంధువులతో పేరు, ఖ్యాతి లభిస్తాయి. నూనె, ఎండుమిర్చి, బెల్లం, చింతపండు వ్యాపారస్తులకు కలిసి వచ్చేకాలం. మీ బలహీనతలు, అలవాట్లు ఇబ్బందులకు దారితీస్తాయి. 
 
కన్య: ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వీలైనంతవరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. దైవ దర్శనాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకు పనుల్లో జాప్యం ఇతర వ్యవహారాలపై ప్రభావం చూపే ఆస్కారం వుంది. విందుల్లో పరిమితి పాటించండి. 
 
తుల : హామీలిచ్చే విషయంలో లౌక్యంగా వుండాలి. కలెక్షన్ ఏజెంట్లు వసూళ్లలో సంయమనం పాటించాలి. ఎవరికీ పెద్దమొత్తంలో నగదు చెల్లింపు మంచిది కాదు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు, సమయం వృధా వంటి చికాకు లెదుర్కుంటారు. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిది కాదని గమనించండి. 
 
వృశ్చికం: ద్విచక్ర వాహనం నిదానంగా నడపటం క్షేమదాయకం. రాజకీయాల్లో ఉన్నవారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆత్మీయులతో ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు, గతంలో ఎదురైనా నిరాశలు మరలా ఆశాజనకంగా మారుతాయి. ప్రముఖులకు సహకరించడం వల్ల మీరు ఎంతో పొందుతారు.
 
 
ధనస్సు: వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగతుంది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని వుండటం శ్రేయస్కరం. మీ పనులు మందకొడిగా సాగుతాయి. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు అధికమవుతాయి.
 
మకరం: ఆర్థిక విషయాల్లో స్వల్ప ఒడిదుడుకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ఏసీ కూలర్, మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తి కానవస్తుంది. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కుటుంబీకులతో యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.
 
కుంభం: ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. పెద్దలతో ఏకీభవించలేకపోతారు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. 
 
మీనం: కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. స్త్రీలు షాపింగ్‌లో దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. కోపంతో పనులు చక్కబెట్టలేరు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు,