సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

astro3
శ్రీ క్రోధినామ సం|| చైత్ర ఐ॥ దశమి రా.8.28 శతభిషం రా.9.34 ఉ.వ.5.50ల 7.20 తె.వ.3.31 ల 5. 01. ఉ.దు. 8.08 ల 8. 59 ప.దు. 12.21 ల 1.11.
 
మేషం :- ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. ఉమ్మడి వెంచర్లు, భాగస్వామిక వ్యాపారాల ఆలోచన ప్రస్తుతానికి వాయిదా వేయండి. అధికారులు ఆగ్రహానికి గురయ్యే ఆస్కారం ఉంది. రావలసిన ధనం చేతికందుతుంది. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదాపడతాయి. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి.
 
వృషభం :- ఆలయాలను సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. తలపెట్టిన పనులు వాయిదాపడతాయి. క్రీడా రంగాలలో వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉత్తర, ప్రత్యుత్తరాలు మీకు ఎంతో సంతృప్తినిస్తాయి. ముఖ్యమైన విషయాలలో కీలకమైనపాత్ర వహిస్తారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు.
 
మిథునం :- ఇసుక, ఇటుక, ఐరన్, కలప, సిమెంటు వ్యాపారస్తులకు శ్రమకు తగిన ఫలితంలభిస్తుంది. కుటుంబీకుల ధోరణి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. ప్రియతముల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. మిత్రులలో ఆకస్మిక మార్పు మాకుఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. 
 
కర్కాటకం :- ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. కోర్టు వ్యవహారాలలో సంతృప్తి, అభివృద్ధి కానవస్తుంది. రిప్రజెంటివులకు, ప్రైవేటు సంస్థలలోని వారికి సదావకాశాలు లభిస్తాయి. మీ విరోధులు వేసే పథకాలు మీరు త్రిప్పికొడతారు. వస్త్ర, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి.
 
సింహం :- తరుచు దైవకార్యాల్లో పాల్గొంటారు. ప్రేమికులు అతిగా వ్యవహరించటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ఉద్యోగ యత్నాలు కలిసివస్తాయి. కుటుంబంలోను, సంఘంలోనూ మీ మాటకు గౌరవం లభిస్తుంది. హామీలు, మధ్యవర్తిత్వాలు ఇబ్బంది కలిగిస్తాయి. వాహన చోదకులు చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది.
 
కన్య :- దంపతుల మధ్య కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది. నిత్యావసర వస్తు వ్యాపారులకు ఆటంకాలు తప్పవు. మీ సంతానం భవిష్యత్తు గురించి కొత్త పథకాలు రూపొందిస్తారు.
 
తుల :- ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు తప్పవు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ కూడదు. మనుష్యుల మనస్థత్వం తెలిసి మసలు కొనుట మంచిది. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది.
 
వృశ్చికం :- ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, జాపం వంటి చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అనుకున్న పనులు ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తారు.
 
ధనస్సు :- పూర్వ మిత్రుల కలయిక మీలో కొత్త ఉత్సాహాన్నిస్తుంది. స్త్రీలకువాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. స్థిరచరాస్తులు విక్రయించాలనే ఆలోచన విరమించుకోవటం మంచిది. నూతన పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. అదనపు సంపాదన కోసం యత్నాలు చేస్తారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు.
 
మకరం :- దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రుల హితవుమీపై మంచి ప్రభావం చూపుతుంది. దూర ప్రయాణాలు విరమించుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ప్రముఖుల గురించి ఆశ్చర్యకరమైన వార్తలు వింటారు. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది.
 
కుంభం :- పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఒక్కోసారి మంచి చేసినావిమర్శలు తప్పవు. తరుచు బంధుమిత్రుల రాకపోక లుంటాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తాడు. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహరాల్లో మెలకువ వహించండి. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.
 
మీనం :- ఆర్థికంగా అభివృద్ధి, పురోభివృద్ధి పొందుతారు. దేవాలయ విద్యా సంస్థలకుదాన ధర్మాలు చేయడంవల్ల మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. ఉద్యోగస్థులకు తోటివారి కారణంగా సమస్యలు తలెత్తుతాయి. ప్రయత్న పూర్వకంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు.