గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

16-12-2021 గురువారం రాశిఫలాలు : రాఘవేంద్రస్వామిని పూజించినా..

మేషం :- కాంట్రాక్టర్లు, బిల్డర్లకు అభ్యంతరాలు, ఆక్షేపణలు ఎదురవుతాయి. సతీసమేతంగా ఒక పుణ్య క్షేత్రాన్ని సందర్శిస్తారు. స్త్రీలు కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా మెలగాలి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి.
 
వృషభం :- వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. మీ ప్రణాళికలు, పథకాలు సత్ఫలితాలిస్తాయి. ధనమూలక సమస్యలను ధీటుగా ఎదుర్కుంటారు. దుబారా ఖర్చులు అధికం. స్త్రీలు కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా మెలగాలి. బంధుమిత్రుల ఆంతర్యాన్ని ఆలస్యంగా గ్రహిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది.
 
మిథునం :- వృత్తి ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. మీ అవసరాలకు కావలసిన ధనం సమయానికి సర్దుబాటుకాగలదు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు పురోభివృద్ధి, ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి, పనిభారం అధికం. వాహనం నడుపునపుడు జాగ్రత అవసరం.
 
కర్కాటకం :- భాగస్వామిక చర్చల్లో అపశృతులు దొర్లే ఆస్కారం ఉంది. ఈడొచ్చిన మీ సంతానం వైఖరి చికాకు పరుస్తుంది. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. బంధువుల రాకతో అనుకోని ఖర్చులు, పెరిగిన అవసరాలు మీ ఆర్థిక స్థితికి అవరోధంగా నిలుస్తాయి. రాజకీయ విషయాల పై ఆసక్తి కనబరుస్తారు.
 
సింహం :- పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా రంగాల వారికి ఒత్తిడి అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కొన్ని సంఘటనలు మీలో మంచి మార్పును తెస్తాయి. ఏ పని మొదలెట్టినా ఆదిలోనే ఆటంకాలు ఎదురవుతాయి. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం.
 
కన్య :- స్త్రీల అవసరాలు, కోరికలు నెరవేరగలవు. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. పెద్దల ప్రమేయంతో కొన్ని వ్యవహారాలు సానుకూలమవుతాయి. రాజకీయనాకులకు సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వాహనం నిదానంగా నడపటం శ్రేయస్కరం. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు.
 
తుల :- స్త్రీల ప్రతిభకు గుర్తింపు, అవకాశాలు కలిసివస్తాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. బంధువుల రాకతో ప్రయాణాలు విరమించుకుంటారు. ఒక స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు స్వయంగా చూసుకోవటం మంచిది. ఉద్యోగస్తులకు కొత్త అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి.
 
వృశ్చికం :- మీ యత్నాలు గోప్యంగా సాగించాలి. విద్యార్థులకు టెక్నికల్, కంప్యూటర్ సైన్సు రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. విదేశీ చదువుల కోసం చేసే యత్నంలో ఏజెంట్లు, బ్రోకర్లతో జాగ్రత్త అవసరం. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్న లక్ష్యం సాధిస్తారు. వ్యాపారాల అభివృద్ధికి ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు.
 
ధనస్సు :- స్త్రీలకు చుట్టుపక్కల వారిలో మంచి మనస్పర్థలు తలెత్తుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవటం మంచిది కాదు. ప్రముఖుల ఇంటర్వ్యూల వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. నిరుద్యోగుల ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది.
 
మకరం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి అచ్చు తప్పులు పడటం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. బంధువులను కలుసుకుంటారు. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు సమస్యలు తప్పవు. విదేశీ చదువుల విషయంలో అడ్డంకులు తొలగిపోగలవు. ప్రయాణాలు ఆలస్యం వల్ల పనులు వాయిదా పడతాయి.
 
కుంభం :- కోళ్ళ, మత్స్య, గొర్రెల వ్యాపారస్తులకు ఆందోళన అధికం అవుతుంది. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికం అవుతున్నారని గమనించండి. స్త్రీల ప్రతిభకు గుర్తింపు, అవకాశాలు కలిసివస్తాయి. వస్తు, వాహనాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇతర కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి.
 
మీనం :- కళ, క్రీడ, శాస్త్ర రంగాల వారికి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. నిర్మాణపనులలో కాంట్రాక్టర్లకు ఒత్తిడి పెరుగుతుంది. మీ ఆశయ సాధనకు నిరంతర కృషి అవసరం అని గమనించండి. నిరుద్యోగుల నిర్లిప్త ధోరణి వల్ల సదవశాలు జారవిడుచుకుంటారు. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, చిరు వ్యాపారులకు శుభదాయకం.