ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : శుక్రవారం, 10 జూన్ 2022 (22:03 IST)

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషరఫ్ ఆరోగ్యం విషమం

Musharaff-health
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్పర్వేజ్ ముషరఫ్ ఆరోగ్యం విషమంగా ఉందని ఆయన కుటుంబ సభ్యులు శుక్రవారం వెల్లడించారు. ముషరఫ్ చనిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. దీంతో ట్విటర్ వేదికగా ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు.

 
‘‘ఆయన వెంటిలేటర్‌పై లేరు. అయితే, గత మూడు వారాల నుంచి ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయన కోలుకోవడం లేదు. కొన్ని అవయవాలు స్పందించడం లేదు. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని దేవున్ని ప్రార్థించండి’’ అని ఆయన కుటుంబం వెల్లడించింది.

 
ప్రస్తుతం ముషరఫ్ పాకిస్తాన్‌లో లేరు. వైద్య చికిత్సల నిమిత్తం 2016లో ఆయన దుబాయి వెళ్లారు.