శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 24 జూన్ 2021 (21:30 IST)

ఆకాష్ ఇనిస్టిట్యూట్ స్టూడెంట్ గణేష్ కె ఇంజనీరు కావాలనే జీవితకాలం కలను నెరవేర్చుకున్నాడు

కోవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్ సుమారుగా ప్రతి ఒక్కరిపై తీవ్రమైన ప్రభావం చూపించింది. ముఖ్యంగా విద్యార్థులకు లాక్ డౌన్ తట్టుకోలేని ఇబ్బంది కలిగించింది. పరీక్షలు రీషెడ్యూల్ కావటం వలన నిరంతరం బాధ, ఆన్ లైన్లో కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ కావటం, మరియు అలాగే అనిశ్చిత భవిష్యత్తు గురించి భయం వంటివి. అయిప్పటికి, బాధ మరియు పోరాటం నిండిన ఈ కాలవ్యవధి అనేక మంది విద్యార్థుల సముదాయంలో అనేక ధైర్య సాహసాల కథలను నింపింది. ఈ కథలు అందరికి ఒక నిజమైన ప్రేరణ. ఈ పరిస్థితిని ఎదుర్కొని పోరాడటం మరియు దానిని సాధించి ప్రతికూల పరిస్థితులలో కూడా సదవకాశం పొందటం గురించి కథలు.
 
ఇలాంటి ఒక కథ- తిరుపతిలోని ఆకాష్ ఇనిస్టిట్యూట్ విద్యార్థి 16 సంవత్సరాల గణేష్ కె గురించి, ఇతడు ఈ నగరంలోని ఒక రోజు కూలీ కార్మికుని కుమారుడు మరియు జెఇఇ పరీక్ష కొరకు ప్రిపేర్ అవుతున్న ఒక విద్యార్థి. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరుకు చెందిన గణేష్ తన జీవితంలో అనేక కఠినమైన కష్టాలు ఎదుర్కున్నాడు. ఆరుగురు సభ్యుల అతడి కుటుంబానికి మౌలిక నిత్యవసరాలు కోసం సంపాదించేవాడు అతడి తండ్రి ఒక్కడే కావటంతో, వీరు చాలా కష్టాలు ఎదుర్కోవటం జరిగింది. అయినప్పటికి, ఐఐటి నుండి ఇంజనీరింగ్ చేయుటకు కృతనిశ్చయం చూపించి, తన తండ్రి ఆర్థిక పరిస్థితి వలన తన చదువు ఇబ్బందిలో పడకూడదని నిర్ణయించుకున్నాడు. జెఇఇ ప్రవేశ పరీక్షకు ప్రిపేర్ కావటానికి అతడు ఆకాష్ ఇనిస్టిట్యూట్లో చేరి 90% స్కాలర్షిప్ సంపాదించాడు, ఫీజు భారం సులభం చేసుకున్నాడు.
 
జీవితమంతా చక్కని అధ్యయన ఆసక్తి కలిగిన గణేష్, తరచుగా రోబోటిక్స్ మరియు కార్ల మెకానిజం మీద ఆసక్తి చూపించేవాడు. షార్ప్ మైండెడ్ స్టూడెంట్‌గా ఇతడు, మిగతా విద్యార్థులకు భిన్నంగా తన ఖాళీ సమయాన్ని ఇంటర్నెట్లో వివిధ టెక్నాలజీలు నేర్చుకోవటానికి ఉపయోగించేవాడు. ఇంజనీర్ కావాలనే తన కల గురించి మాట్లాడుతూ, గణేష్ ఇలా అన్నాడు, “నాకు ఎల్లప్పుడు వివిధ టెక్నాలజీల మీద ఆసక్తి ఉండేది. ఇది ఎల్లప్పుడు, జ్ఞానం పెంచుకోవటం వలన, ఇంతకు ముందు అసాధ్యం అనుకున్నవి సాధించుటలో ప్రయోజనం పొందవచ్చు అని అనిపించేది. నేను నా ఆర్థిక పరిస్థితిలో మాత్రమే కాక, టెక్నాలజీ రంగంలో కూడా మార్పు తీసుకు రావాలని నేను అనుకునేవాడిని.”
 
అతడు ఇంకా ఇలా అన్నాడు, “నా కుటుంబం జీవితంలో అనేక కష్టాలు చూసింది, ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో. మా నాన్నకు ఎక్కడా పని దొరకక, గత రెండు సంవత్సరాలలో కనీస సౌకర్యాలు దొరకక చాలా ఇబ్బందులు పడ్డాం. ఇది నాకు జీవితంలో ఏది కావాలి అనేదానిపై మనసులో దృఢనిశ్చయం కావటానికి ఉపయోగపడింది. మా కుటుంబానికి ఆర్థిక సహాయం అందించగలిగేలా కావాలన్నదే నా జీవిత ఆశయం, అలా వారు చేతిలో చిల్లి గవ్వ లేకుండా అలమటించ గూడదన్నది నా కొరిక.”
 
లాక్ డౌన్ సమయంలో విపరీతంగా నష్టపోయిన రెండవ టైర్  నగరాలు మరియు గ్రామీణ ప్రాతాలలోని విద్యార్థులు తమ చదువులు పూర్తి చేసుకో గలగాలని మరియు వెనకబడరాదని ఆకాష్ ఇనిస్టిట్యూట్ అనేక ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసింది. ఇండియాలోని అన్ని బ్రాంచీలలోని టీచర్లు విద్యార్థులను తీర్చిదిద్దుటకు, వారి సందేహాలు పరిష్కరించుటకు, వారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాలు మరియు దానిలోని ఏ ప్రాబ్లం అయినా తీర్చుకొనుటకు నిరంతర ప్రయత్నాలు చేస్తున్నారు.
 
శ్రీ ఆకాష్ చౌధరి, మేనేజింగ్ డైరెక్టర్, ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఇలా అన్నారు, “ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు తమ చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చుకొనుటకు చేస్తున్న కఠిన శ్రమ నిజంగా చాలా ప్రేరణ కలిగిస్తుంది. మహమ్మారి చాలా జీవితాలను కదలకుండా కట్టి పడేసింది. విద్యార్థుల భద్రత అనేది సర్వదా మా టాప్ ప్రాథమికత, అలాగే ఆర్థిక పరిస్థితులు లేదా జొగ్రాఫికల్ లొకేషన్లు కారణంగా విద్యార్థుల అత్యున్నత కలలు సాధించుటకు అడ్డంకులు కాగూడదు అన్నది కూడా ప్రాథమికతే. లాక్ డౌన్ సీనరియో అనేక మంది విద్యార్థుల భవిష్యత్తుకు అనిశ్చిత పరిస్థితి ఏర్పరిచింది, కానీ గణేష్ వంటి అసాధారణ విద్యార్థులు, కేవలం కొన్ని పరిస్థితుల కారణంగా తమ లక్ష్యాలు సాధించుటలో వెనకబడ కూడదు. నేను అతనికి జెఇఇ లో మంచి లభించాలని నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అతడు తన తల్లిదండ్రుల జీవితంలో మార్పు తీసుకు వస్తాడని ఆశిద్దాం.”
 
ఆకాష్ లో అడ్మిషన్ తీసుకోవాలని కోరుకునే విద్యార్థులు ఇన్ స్టాంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST) తీసుకోవచ్చు లేదా Aakash National Talent Hunt Exam కొరకు రిజిస్టర్ చేసుకోవచ్చు. iACST అనేది క్లాస్ 8 నుంచి 12 వరకు విద్యార్థుల కొరకు ఈమధ్యనే లాంచ్ చేసిన స్కాలర్షిప్ ప్రోగ్రాం, ఇది వారికి ట్యూషన్ ఫీజు మీద 90 వరకు గెలుచుకునే అవకాశం అందిస్తుంది.