శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 6 జూన్ 2017 (09:20 IST)

జియోనీ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా బాహుబలి ప్రభాస్

బాహుబలి సినిమాతో జాతీయ స్థాయి నటుడిగా ఎదిగిన ప్రభాస్‌ను మొబైల్ హ్యాండ్‌సెట్ల తయారీ సంస్థ జియోనీ ఇండియా తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. జియోని ప్రచారకర్తల్లో భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లీతో

బాహుబలి సినిమాతో జాతీయ స్థాయి నటుడిగా ఎదిగిన ప్రభాస్‌ను మొబైల్ హ్యాండ్‌సెట్ల తయారీ సంస్థ జియోనీ ఇండియా తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. జియోని ప్రచారకర్తల్లో భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లీతో పాటు అలియాభట్, శ్రుతిహాసన్, దుల్కర్ సల్మాన్, దల్జిత దోసాంజ్ ఉన్నారు. తాజాగా ప్రభాస్ కూడా జియోనీ బ్రాండ్ అంబాసిడర్‌గా చేరాడు. 
 
ప్రభాస్‌ను తమ ప్రచారకర్తగా తీసుకోవడంతో శక్తివంతమైన బ్యాటరీ, మెరుగైన సెల్ఫీలకు మారుపేరుగా మంచి ఖ్యాతి గడించిన తమ సంస్థకు మరింత ప్రాబల్యం పొందగలుగుతుందని జియోనీ సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అర్వింద్‌ వోరా తెలిపారు. భారతలో కార్యకలాపాలు ప్రారంభించిన ఐదు సంవత్సరాల్లోనే జియోనీ 1.25 కోట్ల మంది కస్టమర్లను సాధించగలిగింది.