శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 18 ఆగస్టు 2019 (11:48 IST)

పెట్రో ఉత్పత్తులు కూడా డోర్ డెలివరీ!

ఇప్పటికే కొన్ని పట్టణాల్లో పెట్రో ఉత్పత్తులను డోర్ డెలివరీ చేస్తున్నారు. తాజాగా మరో 20 నగరాలకు డోర్ డెలివరీ చేయాలని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇండియన్ ఆయిల కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పి), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్.పి.సి.ఎల్)లు నిర్ణయించాయి. 
 
మూడు నెలల్లోపు పెట్రోల్‌ను కూడా డోర్‌ డెలివరీ చేపడతామని ప్రకటించాయి. డోర్‌ డెలివరీ సేవలకు మంచి స్పందన వచ్చిందని, దీనివల్ల సురక్షితంగా ఇంధనాన్ని అందించవచ్చని హెచ్‌పీసీఎల్‌ సీఎండీ ఎంకే సురానా అన్నారు.
 
ప్రస్తుతం 35 నగరాల్లో డీజిల్‌ డోర్‌ డెలివరీ ఉంది. 2,500 లీటర్ల కంటే ఎక్కువ మొత్తంలో డీజిల్‌ కొనేవారికి మాత్రమే ఈ సదుపాయం అందిస్తున్నారు. 2030 నాటికి పెట్రోల్‌కు డిమాండ్‌ 49 మిలియన్‌ టన్నులకు చేరుతుందని అంచనా వేసినట్టు చెప్పారు. దీంతో ఆయిల్‌ కంపెనీలు దేశవ్యాప్తంగా మరో 78,500 ఔట్‌లెట్లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి.