ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (16:34 IST)

2030 నాటికి నో పెట్రోల్-డీజిల్ కార్లు... మారుతీ సుజికీ మొదలెట్టింది...

డీజిల్-పెట్రోల్ కార్లకు భారతదేశంలో స్థానం లేకుండా చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కార్ల కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని ఆయన సూచించారు. దీనితో మారుతీ సుజికీ ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సన్నాహాలు చేస్తోంది. గు

డీజిల్-పెట్రోల్ కార్లకు భారతదేశంలో స్థానం లేకుండా చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కార్ల కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని ఆయన సూచించారు. దీనితో మారుతీ సుజికీ ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సన్నాహాలు చేస్తోంది. గుజరాత్ రాష్ట్రంలోని తన ఫ్యాక్టరీలో విద్యుత్ శక్తితో నడిచే కార్లను తయారుచేయాలని నిశ్చయించింది. 
 
మారుతీ సుజికీ నిర్ణయంతో ఆ కంపెనీ షేర్లు శుక్రవారం నాడు ఒక్కసారిగా 29 శాతానికి పైగా పెరిగాయి. ఇప్పటికే కొన్ని కార్లలో ప్రయోగాత్మకంగా విద్యుత్ శక్తిగా నడిచే ఇంజిన్లను ప్రవేశపెట్టి విజయవంతమైనట్లు కంపెనీ వర్గాలు చెపుతున్నాయి. 2010 నుంచే విద్యుత్ కార్లను తయారు చేసేందుకు ప్రణాళికలు రచించుకున్న మారుతీ సుజికీ ఇక పూర్తిస్థాయిలో రంగంలోకి దిగబోతోంది.