ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానం : కీలక వడ్డీలు యధాతథం
కరోనా కష్టకాలంలో భారతీయ రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి రెండు నెలలకు ఒకసారి నిర్వహించే ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను అలాగే ఉంచింది.
దీంతో రెపో రేటు 4 శాతంగా, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా కొనసాగనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ శుక్రవారం ప్రకటించారు. ఇక మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంకు రేట్లు కూడా 4.25 శాతంగా కొనసాగనున్నాయి.
మరోవైపు 2022 ఆర్థిక సంవత్సరానికిగాను జీడీపీ వృద్ధి రేటు అంచనాను 9.5 శాతానికి తగ్గించింది. గతంలో ఇది 10.5 శాతంగా ఉంటుంది ఆర్బీఐ అంచనా వేసింది. ఇక తొలి త్రైమాసికం జీడీపీ వృద్ధి రేటును గతంలో 26.2 శాతంగా అంచనా వేసినా.. తాజాగా దానిని 18.5 శాతానికి తగ్గించింది.