పన్నీర్ సెల్వం కరివేపాకు... జయ మేనకోడలు దీప సెల్వంను దూరంగా ఎందుకు పెట్టారంటే?
పన్నీరు సెల్వం. జయలలిత మరణించిన తరువాత శశికళపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసి ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్న వ్యక్తి. రాజకీయంగా అనుభవం ఉన్నా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎక్సీపిరియన్స్ ఉన్నా రాజకీయ చతురత లేని వ్యక్తిగా పేరు మూటగట్టుకున్న వ్యక్తి. అదే చివరకు పన్నీరు
పన్నీరు సెల్వం. జయలలిత మరణించిన తరువాత శశికళపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసి ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్న వ్యక్తి. రాజకీయంగా అనుభవం ఉన్నా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎక్సీపిరియన్స్ ఉన్నా రాజకీయ చతురత లేని వ్యక్తిగా పేరు మూటగట్టుకున్న వ్యక్తి. అదే చివరకు పన్నీరు సెల్వంకు కోలుకోలేని దెబ్బ తీసింది. తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం తెలిసిన పన్నీరు సెల్వంకు పూర్తిస్థాయిలో రాజకీయాలు చేయలేరని రాజకీయ విశ్లేషకులే విమర్శిస్తున్నారు. దీన్ని గమనిస్తున్న జయలలిత మేనకోడలు దీప స్వయంగా పన్నీరు సెల్వంతో జతకట్టలేదంటూ తేల్చిచెప్పేశారు.
ఫారెన్‌లో చదువుకున్న అనుభవమున్న దీపకు ప్రత్యక్ష రాజకీయాల గురించి అస్సలు తెలియదన్నది అందరికీ తెలిసిన విషయమే. దీప ఏదో చేయాలని చేస్తోందే తప్ప ఆమెకు ఏం తెలియదని రాజకీయ విశ్లేషకులే స్వయంగా చెబుతున్నారు. అయితే ముందువరకు కూడా పన్నీరు సెల్వంతో కలిసి పనిచేస్తానని చెప్పిన దీప ఒక్కసారిగా మాట మార్చడానికి ఎన్నో కారణాలున్నాయి. అందులో మొదటిది కేంద్ర ప్రభుత్వమే పన్నీరు సెల్వంకు సిఎం అయ్యేందుకు ఎన్నో అవకాశాలిచ్చినా ఆయన మాత్రం వినియోగించుకోకపోవడం. శశికళ శిబిరంలోని ఎమ్మెల్యేలను బుజ్జగించో, బెదిరించో తనవైపు తిప్పుకోలేకపోవడం, మద్ధతిచ్చిన ఎమ్మెల్యేలతో సరిపుచ్చుకోవడం... ఇలా ఎన్నింటినో గమనిస్తూ వచ్చారు దీప.
శశికళకు తన శత్రువు అయినప్పుడు ఎవరు శశికళను శత్రువుగా భావిస్తే వారిని కలుపుకొని వెళతానని చెప్పిన దీప అదేవిధంగా పన్నీరు సెల్వంతో కలవడానికి సిద్ధమయ్యారు. అయితే పన్నీరు సెల్వం పరిస్థితిని దగ్గరగా చూసిన దీప ఆయనతో కలిస్తే ఇక రాజకీయ సన్యాసమేనని భావించారు. అందుకే దీప ఏకంగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అందుకే నిన్న ఎంజిఆర్ అమ్మ పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించిన దీప ఆ తరువాత పన్నీరు సెల్వంను కలవడం లేదని తేల్చిచెప్పేశారు.
పార్టీ పేరైతే అన్నాడిఎంకేకు దగ్గరగా ఉంది. అయితే ఆమె మరో నిర్ణయం కూడా తీసేసుకున్నారు. జయలలిత పోటీ చేసిన ఆర్కే నగర్ నుంచే పోటీచేస్తానని ప్రకటించారు. జయలలితకు అసలైన రాజకీయ వారసురాలు తాను మాత్రమేనని ఇప్పటికీ దీప చెబుతూనే ఉన్నారు. దీప రాజకీయ ప్రవేశం ఎలాగున్నా పన్నీరు సెల్వంను మాత్రం ఆమె తన పార్టీలో చేర్చుకోకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారుతోంది.