1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Cloves: Health benefits and uses

లవంగాలను చందనంతో కలిపి మెత్తగా నూరి చర్మానికి రాసుకుంటే....

Cloves Health benefits and uses
వంట దినుసుల్లో లవంగాలు ప్రత్యేకమైనవి. వీటిలో వైద్య విలువలు కూడా ఉన్నాయి. లవంగ నూనెను పంటి నొప్పికి మందుగా ఉపయోగిస్తారు. బాగా నలిపిన లవంగ ఆకులు పంటి నొప్పి నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. ఎసిడిటి మరియు అజీర్ణానికి లవంగ నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది.

 
లవంగాలు తెల్ల రక్త కణాలను పెంపొదిస్తుంది. అలాగే జీవిత కాలాన్ని పెంపొందించే గుణాలు ఇందులో ఉన్నాయి. ఎలాంటి చర్మ వ్యాధినైనా లవంగాలు ఇట్టే మాయం చేసేస్తాయి. దీనిని చందనంతోపాటు రుబ్బుకుని లేపనంలా చర్మానికి పూస్తే చర్మ వ్యాధులుమటుమాయమంటున్నారు వైద్యులు.

 
ఎవరైనా కఫం, పిత్త రోగాల బారిన పడినవారుంటే ప్రతి రోజు లవంగాలను సేవిస్తుంటే ఈ జబ్బులు మటుమాయమౌతాయి. ఎక్కువగా దప్పిక వేసినప్పుడు లవంగ పలుకులు తింటే దప్పిక తీరి ఉపశమనం కలుగుతుంది. జీర్ణశక్తి తగ్గినట్లనిపిస్తే రెండు లవంగాలు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నిత్యం లవంగాలను తీసుకోవాలనుకునేవారు కేవలం ఐదు లవంగాలను మాత్రమే సేవించాలి. అంతకు మించి వాడితే శరీరం వేడి చేస్తుంది.
తర్వాతి కథనం
ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం: మహిళలను వేధించే ఈ సమస్యకి చెక్ పెట్టేదెలా?