గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 25 మే 2022 (14:29 IST)

ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం: మహిళలను వేధించే ఈ సమస్యకి చెక్ పెట్టేదెలా?

Thyroid
ప్రతి ఏడాది మే 25న ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2007లో థైరాయిడ్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ సభ్యులు ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. యూరోపియన్ థైరాయిడ్ అసోసియేషన్ ఈ రోజున స్థాపించబడినందున 25 మే 1965లో తేదీగా ఎంపిక చేయబడింది.  ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని యూరోపియన్ థైరాయిడ్ అసోసియేషన్ మొదటిసారిగా జరుపుకుంది. తరువాత 2010లో, అమెరికన్ థైరాయిడ్ అసోసియేషన్ ఈ రోజుకు తన మద్దతును ప్రకటించింది.

 
అమెరికన్ థైరాయిడ్ అసోసియేషన్, లాటిన్ అమెరికన్ థైరాయిడ్ సొసైటీ, ఆసియా-ఓషియానియా థైరాయిడ్ అసోసియేషన్ యూరోపియన్ థైరాయిడ్ అసోసియేషన్‌తో కలిసి థైరాయిడ్, థైరాయిడ్ సంబంధిత వ్యాధుల పనితీరు గురించి అవగాహన కల్పించేందుకు ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.

 
మహిళల్లో చాలామందిని వేధించే సమస్య థైరాయిడ్. థైరాయిడ్ సమస్యను తెలిపే ముందస్తు హెచ్చరిక సంకేతాలు ఏమిటో చూద్దాం. అలసటగా వుంటుంది. బరువు పెరుగుతారు లేదంటే బరువు తగ్గడం వుంటుంది. హృదయ స్పందన కాస్త మందగమనంగా వుంటుంది లేదా హృదయ స్పందన రేటు పెరుగుతుంది. వేడికి సున్నితత్వంగా వుంటుంది శరీరం, అలాగే చలికి సున్నితత్వంగా వుంటుంది.

 
ఇంకా ఆందోళన, చిరాకు, భయాన్ని ప్రదర్శిస్తుంటారు. నిద్రించడానికి ఇబ్బంది పడుతుంటారు. కండరాల బలహీనత, వణుకు కలిగి ఉంటుంది. క్రమరహితంగా బహిష్టు కాలం వస్తుండటం. రోగి సాధారణ మెడ నొప్పి, గొంతు నొప్పి, జ్వరం, చలి మరియు లేత థైరాయిడ్ సమస్య కలిగి ఉండవచ్చు. థైరాయిడ్ యొక్క వాపు శరీరంలోకి థైరాయిడ్ హార్మోన్ యొక్క అధిక మొత్తంలో స్రవిస్తుంది, దీని వలన హైపర్ థైరాయిడిజం ఏర్పడుతుంది.

 
థైరాయిడ్‌తో సమస్యలు ఎందుకు వస్తాయి
అయోడిన్ లోపం. ఆటో ఇమ్యూన్ వ్యాధులు, దీనిలో రోగనిరోధక వ్యవస్థ థైరాయిడ్‌పై దాడి చేస్తుంది. ఇది హైపర్ థైరాయిడిజం లేదా హైపో థైరాయిడిజం వాపు సమస్య తలెత్తుతుంది. ఇది నొప్పి కలిగించవచ్చు లేదా కలిగించకపోవచ్చు.

 
ఎలాంటి పదార్థాలతో నిరోధించవచ్చు...
థైరాయిడ్ పనితీరుకు సహాయపడటానికి అయోడిన్-రిచ్ ఫుడ్స్ తీసుకుంటుండాలి. సముద్రపు చేపలు, రొయ్యలు, పెరుగు, పాలు, జున్నుతో సహా పాల ఉత్పత్తులు. గుడ్లు, గింజలు, అయోడైజ్డ్ ఉప్పు... దీనినే టేబుల్ సాల్ట్ అని కూడా పిలుస్తారు వంటివి తీసుకుంటుండాలి.