ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 23 మే 2022 (21:14 IST)

హిమోగ్లోబిన్ పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

vegetables
హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గిన వ్యక్తి ఐరన్-రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తినాలి. ఐరన్ హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచడానికి పనిచేస్తుంది, ఇది మరింత ఎర్ర రక్త కణాలను ఏర్పరుస్తుంది. ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు ఏమిటో చూద్దాం. మాంసం, చేపలు. సోయా ఉత్పత్తులు, గుడ్లు, ఎండిన పండ్లు, ఖర్జూరాలు, అత్తి పండ్లు, పచ్చి ఆకు కూరలు, బచ్చలికూర, ఆకుపచ్చ బీన్స్, గింజలు.

 
ఫోలేట్ వున్నటువంటి ఆహారం కూడా హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి. ఫోలేట్ అనేది విటమిన్ బి రకం, ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరం ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడానికి సహాయపడే హిమోగ్లోబిన్‌లోని కణాలను ఉత్పత్తి చేయడానికి ఫోలేట్‌ను ఉపయోగిస్తుంది. ఒక వ్యక్తికి తగినంత ఫోలేట్ లభించకపోతే, వారి ఎర్ర రక్త కణాలు పరిపక్వం చెందవు. ఇది ఫోలేట్-లోపం అనీమియా, తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిలకు దారితీయవచ్చు. ఫోలేట్ లభించే పదార్థాలు... పాలకూర, బియ్యం, వేరుశెనగ, అలసందలు, బీన్స్, పాలకూర.

 
హిమోగ్లోబిన్ కోసం సప్లిమెంట్లలో ఐరన్ తీసుకోవడం చాలా ముఖ్యం, కానీ ఒక వ్యక్తి తన శరీరాన్ని ఆ ఇనుమును గ్రహించడంలో కూడా సహాయపడాలి. సిట్రస్ పండ్లు, స్ట్రాబెర్రీలు, ఆకు కూరలు వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు ఇనుము శోషించడాన్ని పెంచుతాయి. విటమిన్ సి సప్లిమెంట్ తీసుకోవడం కూడా సహాయపడవచ్చు. విటమిన్ ఎ, బీటా కెరోటిన్ ఇనుమును గ్రహించడంలో, ఉపయోగించడంలో శరీరానికి సహాయపడతాయి. విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాలు ఏమిటంటే...  చేపలు, కాలేయం, చిలగడదుంపలు.

 
విటమిన్ ఎ సప్లిమెంట్లు శరీరానికి ఇనుమును అందించడంలో సహాయపడతాయి. కానీ విటమిన్ ఎ ఎక్కువగా తీసుకుంటే ప్రమాదకరం. అధిక విటమిన్ ఎ హైపర్విటమినోసిస్ ఎ అని పిలవబడే పరిస్థితికి దారితీయవచ్చు. ఇది ఎముక- కీళ్ల నొప్పులు, తీవ్రమైన తలనొప్పి- మెదడులో ఒత్తిడి పెరగడం వంటి లక్షణాలను కలిగిస్తుంది.

 
హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉన్న వ్యక్తికి ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవాలని డాక్టర్ సలహా ఇవ్వవచ్చు. మోతాదు వ్యక్తి స్థాయిలపై ఆధారపడి ఉంటుంది. చాలా ఎక్కువ మోతాదులో తీసుకునే ఇనుము ప్రమాదకరం అని గమనించడం ముఖ్యం. ఇది హెమోక్రోమాటోసిస్‌కు కారణం కావచ్చు, ఇది కాలేయ వ్యాధికి, మలబద్ధకం, వికారం, వాంతులు వంటి దుష్ప్రభావాలకు దారితీస్తుంది. కనుక వీటిని దృష్టిలో పెట్టుకుని మందులు వాడాల్సి వుంటుంది.