1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. iron and its importance for human health

అనీమియాకి దారితీసే ఐరన్ లోపం... ఏం చేయాలి...?

Iron
మన శరీరానికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో ఐరన్ కూడా అంతే ముఖ్యం. ఆహారంలో ఐరన్ లోపించడం మూలంగా రక్తహీనత కలుగుతుంది. అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను చేరవేయటంలో, కణాల పెరుగుదలలో దీని అవసరం ఎంతో ఉంది. ఐరన్ కలిగిన ముఖ్యమైన ఆహార పదార్ధాలు చేపలు, గుడ్లు, పప్పుధాన్యాలు, మాంసం, ఆకుకూరలు, బెల్లం మొదలైనవి. 
 
శరీరంలో తగినంత ఐరన్ లేకపోతే తీవ్రమైన రక్తహీనతకు దారి తీస్తుంది. ఐరన్‌ను సరిపడినంతగా తీసుకుంటే మెదడు పనితీరు, జీవక్రియలు మెరుగవటంలో ఉపయోగపడుతుంది. శరీరంలో ఇనుము లోపించటాన్ని ‘అనీమియా’ అంటారు. మనదేశంలో పిల్లలు, గర్భవతులు ఎక్కువగా అనీమియా సమస్యతో బాధపడుతున్నారు. 
 
కాయగూరలు, ఎండుఫలాలు, ఎక్కువగా ఇనుము కలిగి ఉంటాయి. రాగులు, సజ్జలు లాంటి చిరుధాన్యములు కూడా ఇనుముకు చక్కని ఆహారాలు. ఐతే ఆకుకూరల ద్వారా కేవలం 3 నుంచి 5 శాతం ఇనుమును మత్రమే శరీరం గ్రహిస్తుంది. మాంసం, చేపలు, కోడి మాంసము, గుడ్డు నుంచి కూడా శరీరానికి కావలసిన ఇనుము లభిస్తుంది. ఐరన్ శరీరంలో చక్కగా ఇమిడిపోవడానికి ఉసిరి, జామ లాంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
About Writer
chitra