సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 17 మార్చి 2017 (20:20 IST)

అలోవెరా(కలబంద)ను రోడ్ల పక్కన కూడా అమ్ముతున్నారు... అందులో ఏముంది?

అలోవెరా మధుమేహాన్ని నియంత్రించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఫోలిక్ యాసిడ్, విటమిన్స్ పుష్కలంగా ఉండే అలోవెరా రక్తకణాలు, గుండెకి సంబంధించిన రక్త ప్రసరణ వ్యవస్థను కాపాడుతుంది. మన శరీరానికి అవసరమైన 75 రకాల పోషక విలువలు ఉన్నాయి. జీర్ణవ్యవస్థలో పేరుకుపోయి

అలోవెరా మధుమేహాన్ని నియంత్రించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఫోలిక్ యాసిడ్, విటమిన్స్ పుష్కలంగా ఉండే అలోవెరా రక్తకణాలు, గుండెకి సంబంధించిన రక్త ప్రసరణ వ్యవస్థను కాపాడుతుంది. మన శరీరానికి అవసరమైన 75 రకాల పోషక విలువలు ఉన్నాయి. జీర్ణవ్యవస్థలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను, విషపదార్థాలను వెలుపలికి నెట్టి వేసే సహజ గుణం అలోవెరాలో ఉన్నాయి. 
 
యాంటి బయాటిక్స్ వాడనవసరం లేకుండా వాపులను, నొప్పులను తగ్గించే గుణం దీని జెల్‌లో ఉంది. మధుమేహ రోగుల ఆహార నియంత్రణ వలన ఏర్పడే పాదాలలో తిమ్మిర్లు మొదలైన సమస్యలను నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
వేసవిలో అలోవెరా ఫేస్ ప్యాక్‌తో మెరిసే సౌందర్యం పొందవచ్చు. తేనె, పసుపు, పాలు, అలోవెరా వేసి మొత్తాన్ని మిక్స్ చేయాలి. ఫేస్ ప్యాక్‌లా అప్లై చేసుకుంటే చర్మ మృదువుగా తయారవుతుంది. అలాగే కలబంద డ్రై స్కిన్ నివారించడంలో కూడా చాలా గ్రేట్‌గా సహాయపడుతుంది. అందుకు నిమ్మరసం, ఖర్జూరం, కలబంద మిక్స్ చేసి ఫేస్‌కు ప్యాక్‌లా వేసుకోవాలి. ఈ ప్యాక్‌ను వారానికి రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
సున్నితమైన చర్మం కలిగిన వారు అలోవెర ఫేస్ ప్యాక్ కోసం కీరదోసకాయ రసంలో కలబంద, రోజ్ వాటర్ మిక్స్ చేసి దీన్ని ఫేస్ ప్యాక్‌గా లేదా ఫేస్ వాష్‌గా ఉపయోగించుకోవచ్చు.