కడుపులో మంట... ఎసిడిటీ... తగ్గించుకునేందుకు ఏం చేయాలి...?
కడుపులో మంట తగ్గాలంటే జీర్ణ రసాలు ఉత్పత్తి సమయాల్లో భుజించాలి. అవి ఎప్పుడంటే ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు అల్పాహారం, మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు మధ్యాహ్న భోజనం, రాత్రి 6 నుంచి 8 గంటల వరకు రాత్రి భోజనం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
కడుపులో మంట తగ్గాలంటే జీర్ణ రసాలు ఉత్పత్తి సమయాల్లో భుజించాలి. అవి ఎప్పుడంటే ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు అల్పాహారం, మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు మధ్యాహ్న భోజనం, రాత్రి 6 నుంచి 8 గంటల వరకు రాత్రి భోజనం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా కడుపులో మంట తగ్గేందుకు ఎక్కువగా నీరు తాగాలి. ప్రశాంత వాతావరణంలో భోజనం చెయ్యాలి, ఆదుర్దాపడకుండా ఆహారం తీసుకోవాలి. రాత్రి నిద్రపోవడానికి సుమారు రెండు గంటలకు ముందే భోజనం తీసుకోవాలి. వేళకు భోజనం, వేళకు నిద్ర మంచి అలవాట్లు తప్పనిసరి. భోజనం మధ్యలో కొద్దిగా మాత్రమే నీరు తాగాలి.
ఆహారం బాగా నమిలి తినాలి. ఆహారం తీసుకున్న తర్వాత నెమ్మదిగా నడవాలి. వేళకి భోజనం చెయ్యడానికి వీలుపడకపోతే ప్రత్యామ్నాయంగా ఏదో మరో పదార్థాన్ని తీసుకోవాలి. కనీసం రెండు గ్లాసుల మంచినీరైనా తాగితే ఎసిడిటి కొంతవరకు తగ్గుతుంది. మంచి ఆహారపుటలవాట్లు, పోషకాహారం అవసరం. ఉదయం, సాయంత్రం నడవాలి.