శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By ఠాగూర్

అనారోగ్యంతో హ్యారీ పోటర్ నటుడు ఇకలేరు..

harry potter actor
హ్యారీ పోటర్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ నటుడు సర్ మైఖేల్ గాంబోన్ ఇకలేరు. ఆయన  వయసు 82 సంవత్సరాలు. హ్యారీ పోటర్ చిత్రాల్లో మైఖేల్ గాంబోన్ ప్రొఫెసర్ ఆల్బన్ డంబుల్ డోర్ పాత్ర పోషించారు. హ్యారీ పోటర్ సిరీస్‌లో మొత్తం 8 చిత్రాలు ఉండగా, ఆయన ఆరు చిత్రాల్లో నటించి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. 
 
ఈయన గత కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతూ, గాంబోన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టు భార్య, కుమారుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో జన్మించిన గాంబోన్ బాల్యంలోనే కుటుంబంతో సహా లండన్ తరలివచ్చారు. 
 
నాటకరంగం, టీవీ, సినిమాలు, రేడియో... ఇలా నటనకు అవకాశమున్న ప్రతి చోట తన ప్రతిభను ప్రదర్శించారు. సర్ మైఖేల్ గాంబోన్ తన కెరీర్ లో 4 పర్యాయాలు ప్రతిష్టాత్మక బాఫ్టా అవార్డులు అందుకున్నారు. నాటకరంగంలో ఆయన సేవలకు గుర్తింపుగా బ్రిటీష్ ప్రభుత్వం 1998లో ఆయనను నైట్ హుడ్ బిరుదుతో సత్కరించింది.