ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By pnr
Last Updated : సోమవారం, 31 జులై 2017 (10:27 IST)

పరగడుపున 10 కరివేపాకులు తింటే...

కర్ణుడు లేని భారతం, కరివేపాకులేని కూర ఒకటేనని అంటారు మన పెద్దలు. అలాగే, 'కరివేపాకే కదా' అంటూ చిన్నచూపు చూసేవారు ఇప్పుడు ఆలోచనలో పడక తప్పదు. కూరైనా, సాంబారు అయినా, ఉప్మా, రసం దేనిలోనైనా కరివేపాకు వేస్త

కర్ణుడు లేని భారతం, కరివేపాకులేని కూర ఒకటేనని అంటారు మన పెద్దలు. అలాగే, 'కరివేపాకే కదా' అంటూ చిన్నచూపు చూసేవారు ఇప్పుడు ఆలోచనలో పడక తప్పదు. కూరైనా, సాంబారు అయినా, ఉప్మా, రసం దేనిలోనైనా కరివేపాకు వేస్తే వచ్చే రుచే వేరు. 
 
అందుకే ప్రతి కూరలోనూ కరివేపాకు వేస్తుంటాం. ఈ ఆకు వేయడం వల్ల కూరలకు మంచి రుచి, వాసన వస్తాయి. అయితే కూరల్లో లేదా ఇతర ఏ ఆహార పదార్థాల్లో ఉన్న కరివేపాకును అయినా చాలా మంది తినరు. పక్కన పెట్టేస్తారు. కానీ ఇప్పుడు చెప్పబోయే లాభాలు చదివితే కరివేపాకును వదిలి పెట్టకుండా తింటారు. ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున 10 కరివేపాకు ఆకులను తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 
 
రక్తహీనత సమస్య ఉన్నవారు నిత్యం పది కరివేపాకులను తింటే రక్తం బాగా పెరుగుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు వృద్ధి అవుతాయి. రక్త సరఫరా కూడా మెరుగు పడుతుంది. 
 
నిత్యం ఉదయాన్నే కరివేపాకు ఆకులను తింటే మధుమేహం కొద్ది రోజుల్లో పూర్తిగా అదుపులోకి వస్తుంది. టైప్ 1, 2 ఎలాంటి డయాబెటిస్ అయినా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. మధుమేహ వ్యాధి గ్రస్తుల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. 
 
మద్యంబాబు, మాంసాహారం అధికంగా ఆరగించేవారికి సహజంగానే కాలేయ సమస్యలు వస్తాయి. అయితే నిత్యం కరివేపాకు ఆకులను తింటుంటే లివర్ శుభ్రమవుతుంది. లివర్‌లో ఉండే విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. 
 
కరివేపాకులు తినడం వల్ల జీర్ణ సమస్యలు పోతాయి. తీసుకున్న ఆహారం సరిగా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండవు. డయేరియా సమస్య తొలగిపోతుంది. నీళ్ల విరేచనాలు ఆగుతాయి. వెంట్రుకలు చక్కగా పెరుగుతాయి. నల్లగా మారుతాయి. చుండ్రు పోతుంది. నేత్ర సమస్యలు ఇది చక్కటి ఔషధం. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.