శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శనివారం, 8 అక్టోబరు 2016 (12:49 IST)

నగ్న చిత్రాలు చిత్రీకరించేందుకు.. బాత్రూమ్‌లో సీసీటీవీ కెమెరాలు పెట్టాడు.. అడ్డంగా బుక్కయ్యాడు

సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ ఆకతాయిల ఆగడాలకి కొదవలేకుండాపోతుంది. ఎవరికంట పడకుండా మహిళలు స్నానాలు చేసే గదిలో సీక్రెట్ కెమెరాలు దర్శనమిస్తున్నాయి. తాజాగా అలాంటి యవ్వారమే ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంల

సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ ఆకతాయిల ఆగడాలకి కొదవలేకుండాపోతుంది. ఎవరికంట పడకుండా మహిళలు స్నానాలు చేసే గదిలో సీక్రెట్ కెమెరాలు దర్శనమిస్తున్నాయి. తాజాగా అలాంటి యవ్వారమే ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో వెలుగుచూసింది. యువతుల బాత్ రూమ్‌లో ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్ రహస్యంగా కెమెరాలు పెట్టి నగ్న దృశ్యాలను చిత్రీకరించాడట. పరిశీలన కోసం కెమెరాలని వాడాల్సిన యాజమాన్యం ఆకతాయులతో కలిసి కెమెరాలని అసాంఘిక కార్యకలాపాలకు వాడుతున్నారు. 
 
తాజాగా తూర్పు సిడ్నీ నగరంలోని కింగ్స్ ఫోర్డ్ యూనిట్ అపార్టుమెంటులో యువతులు వినియోగించే బాత్ రూమ్‌లో స్టీఫెన్ యావో అనే రియల్ ఎస్టేట్ ఏజెంట్ రహస్య కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఓ యువతి స్నానం చేస్తుండగా బాత్ రూమ్‌లో ఒక రహస్య కెమెరా బయట పడింది. దీంతో కంగారుపడిన యువతి కెమెరాను తీసుకొని మారౌబా పోలీసుస్టేషనుకు వెళ్లి ఫిర్యాదు చేసింది. 
 
యువతీ తీసుకెళ్లిన పెన్‌డ్రైవ్ వంటి కెమెరాని పరిశీలంచిన పోలీసులు స్నానం చేస్తున్న యువతుల వీడియోలు స్పష్టంగా రికార్డ్ అయినట్లు గుర్తించారు. దీంతో ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్ స్టీఫన్ యువోను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న రహస్య కెమెరాలతోపాటు సీసీటీవీ ఫుటేజ్‌ను వేవేర్లీ కోర్టులో గురువారం ప్రవేశపెట్టారు. ముగ్గురు యువతుల నగ్న దృశ్యాలను రహస్య కెమెరాల ద్వారా చిత్రీకరించానని నిందితుడైన స్టీఫెన్ యావో కోర్టులో నేరాన్ని అంగీకరించాడు. దీంతో కోర్టు నవంబరు 23వ తేదీన తన తీర్పు వెలువరించనుంది.