బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 21 డిశెంబరు 2018 (21:52 IST)

66 ఏళ్ల లేటు వయసులో పెళ్లి చేసుకోబోతున్న రష్యా అధ్యక్షుడు...

రష్యా అధ్యక్షుడు పుతిన్ లేటు వయసులో వివాహానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే తాను వివాహం చేసుకోబోతున్నట్లు స్వయంగా ఆయనే ప్రకటించారు. కానీ తాను వివాహం చేసుకునే వ్యక్తికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించలేదు. కానీ ఒలింపిక్స్ మాజీ జిమ్నాస్ట్ అలీనా కబేవాతో పుతిన్ సన్నిహితంగా వున్నారని రష్యాలో పెద్ద చర్చ సాగుతోంది. 
 
కానీ ఈ వార్తలను పుతిన్ ఖండించడంతో... ఆయన ఎవరిని ఇంత లేటు వయసులో పెళ్లాడనున్నాడని సర్వత్రా చర్చ సాగుతోంది. కాగా 1983లో ల్యూడ్మిలాను పుతిన్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. 2013లో వీరు విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు వున్నారు. భార్యతో విడిపోయినప్పటి నుంచి పుతిన్ వివాహంపై చర్చ సాగుతూనే వుంది. అయితే 66 ఏళ్ల వయస్సులో పుతిన్ వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది.