మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 20 మార్చి 2018 (15:47 IST)

రష్యా అధ్యక్ష పీఠంపై మరోమారు వ్లాదిమిర్ పుతిన్

రష్యా అధ్యక్షుడుగా మరోమారు వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రజలు మరోమారు పుతిన్‌కే పట్టం కట్టారు. ఫలితంగా 65 ఏళ్ల వ్లాదిమిర్ పుతిన్ వరుసగా నాలుగోసారి అధ్య

రష్యా అధ్యక్షుడుగా మరోమారు వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రజలు మరోమారు పుతిన్‌కే పట్టం కట్టారు. ఫలితంగా 65 ఏళ్ల వ్లాదిమిర్ పుతిన్ వరుసగా నాలుగోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో మరో ఆరేళ్ల పాటు అధ్యక్షపదవిలో కొనసాగుతారు. 
 
ఈ ఎన్నికల్లో పుతిన్‌కు మొత్తం 76.67 శాతం ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి కమ్యూనిస్ట్‌ పార్టీ నేత పావెల్‌ గ్రుడినిన్‌కు 11.79 శాతం ఓట్లు వచ్చాయి. ఈ విజయంతో 2024 వరకూ పుతిన్‌ రష్యా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.
 
2014లో ఉక్రెయిన్‌ నుంచి రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాలో పుతిన్‌కు 92 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి అలెక్సీ నావెల్నీపై రష్యా ఎన్నికల సంఘం వేటు వేయడంతో పుతిన్‌ విజయం లాంఛనప్రాయమైంది.