శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 14 మార్చి 2018 (10:41 IST)

నేపాల్ అధ్యక్షురాలిగా బిద్యాదేవి భండారి

నేపాల్ అధ్యక్షురాలిగా మరోసారి బిద్యాదేవి భండారి గెలుపొందారు. తొలి మహిళా అధ్యక్షురాలైన ఆమె రెండోసారి కూడా దేశాధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు. అధ్యక్ష స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఆమె భారీ మెజారిటీతో గెల

నేపాల్ అధ్యక్షురాలిగా మరోసారి బిద్యాదేవి భండారి గెలుపొందారు. తొలి మహిళా అధ్యక్షురాలైన ఆమె రెండోసారి కూడా దేశాధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు. అధ్యక్ష స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఆమె భారీ మెజారిటీతో గెలుపొందారు. 
 
వామపక్ష కూటమి అభ్యర్థి భండారి తన ప్రత్యర్థి, నేపాలీ కాంగ్రెస్ (ఎన్సీ) అభ్యర్థి కుమారి లక్ష్మీరాయ్‌పై 2/3వంతు కంటే అధిక మెజారిటీ సాధించి విజయం సాధించారు. భండారికి మొత్తం 39,275 ఓట్లు రాగా, లక్ష్మీరాయ్‌కి 11,730 ఓట్లు వచ్చాయని ఎన్నికల కమిషన్ అధికార ప్రతినిధి నవరాజ్ మంగళవారం వెల్లడించారు. 
 
నేపాల్‌ తొలి మహిళా అధ్యక్షురాలిగా ప్రత్యేకంగా నిలిచిన ఆమె మరోమారు అదే పదవిలో కొనసాగనున్నారు. అధికార వామపక్ష కూటమి భాగస్వాములతో పాటూ ఇతర పలు పార్టీలు బిద్యాదేవి అభ్యర్థిత్వానికి మొదటి నుంచీ మద్దతు తెలిపాయి.