శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 26 ఆగస్టు 2017 (22:14 IST)

శ్రీవారి సేవలో నేపాల్ ప్రధాని షేర్ బహదూర్

తిరుమల శ్రీవారిని నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు. ఆలయం వద్ద టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రధానమంత్రికి ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. రంగనాయకమండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామి

తిరుమల శ్రీవారిని నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు. ఆలయం వద్ద టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రధానమంత్రికి ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. రంగనాయకమండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామివారిని దర్సించుకున్న నేపాల్ ప్రధాని టిటిడి అధికారులు ధన్యవాదాలు తెలిపారు.
 
అంతకుముందు నేపాల్ ప్రధాని ప్రత్యేక విమానంలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న నేపాల్ ప్రధాని కాస్త విరామం తరువాత నేరుగా తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్సించుకున్నారు.