బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 18 జనవరి 2017 (10:36 IST)

అమెరికన్ లాయర్ అరెస్ట్.. పిల్లల పోర్న్ చిత్రాలను డౌన్లోడ్ చేసుకుని.. షేర్ చేస్తూ..

పోర్న్ చిత్రాలను డౌన్లోడ్ చేసుకుని దాన్ని షేర్ చేసుకుంటున్న వారి సంఖ్య పెచ్చరిల్లిపోతోంది. ఇంటర్నెట్ ద్వారా పిల్లల అసభ్యకర చిత్రాలను డౌన్లోడ్ చేసుకుని దాన్ని షేర్ చేసుకుంటున్న జేమ్స్ కిర్క్ జోన్స్ అనే

పోర్న్ చిత్రాలను డౌన్లోడ్ చేసుకుని దాన్ని షేర్ చేసుకుంటున్న వారి సంఖ్య పెచ్చరిల్లిపోతోంది. ఇంటర్నెట్ ద్వారా పిల్లల అసభ్యకర చిత్రాలను డౌన్లోడ్ చేసుకుని దాన్ని షేర్ చేసుకుంటున్న జేమ్స్ కిర్క్ జోన్స్ అనే అమెరికన్ లాయర్ని హైదరాబాద్ క్రైం బ్రాంచి పోలీసులు అరెస్టు చేశారు. ఇతని ఇండియన్ వీసా కాల పరిమితి వచ్చే డిసెంబర్ నాటికి ముగుస్తుంది. ఇతని కంప్యూటర్, హార్డ్ డిస్క్‌‍ల నుంచి సుమారు 30 వేల చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు, చిత్రాలను చూసి పోలీసులు షాక్ తిన్నారు. 
 
42 ఏళ్ళ జెమ్స్ మాధాపూర్‌లోని ఓ ఐటీ సంస్థకు చెందిన లీగల్ విభాగంలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్. ఇతడు తన వీడియోలను షేర్ చేసుకునేందుకు 25 ట్విటర్ హ్యండిల్స్ వాడుతున్నాడని, టోరెంట్, గైగా ట్రైబ్ వంటి ఫైల్ షేరింగ్ నెట్ వర్క్ ద్వారా తనలాంటి విపరీత పోకడలున్నవారికి వీటిని పంపుతున్నాడని తెలిసింది. అమెరికాలో తన బాల్యాన్ని గడిపిన జేమ్స్.. తనకు చిన్నప్పటినుంచే ఈ అసభ్యకర అలవాటు ఉండేదని ఒప్పుకున్నాడు.