శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (17:42 IST)

ఆస్ట్రేలియా డార్లింగ్ నదిలో చేపలన్నీ తేలిపోయాయి... ఏమైంది?

ఆస్ట్రేలియా నగరంలో డార్లింగ్ నదిలో దారుణం జరిగింది. ఈ నదిలోని వేలాది చేపలు, నీటిలో నివసించే జీవరాశులు నశించిపోయిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఇటీవల డార్లింగ్ నదిలోని చేపల్ని చనిపోవడం.. నీటిపై తేలియాడటం చూసిన జనమంతా షాక్ అయ్యారు. ఈ ఘటనపై జరిగిన దర్యాప్తులో.. ఆస్ట్రేలియాలోని కరువు కారణంగా, భారీ ఉష్ణోగ్రతలతో నదిలోని చేపలు చనిపోయినట్లు తేలింది. 
 
ఉష్ణోగ్రతలో మార్పు, ఆక్సిజన్ శాతం తగ్గడం, ఆల్కా విషపూరితంగా మారడంతో చేపలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడ్డాయని.. తద్వారా చనిపోయానని పరిశోధకులు తెలిపారు. అలాగే ఆస్ట్రేలియాలో ఏర్పడిన ఉష్ణోగ్రత మార్పుకు 40కి పైబడిన గుర్రాలు కూడా మృతి చెందాయి. గత 1939వ సంవత్సరానికి తర్వాత ఆస్ట్రేలియాలో ఇలాంటి ఉష్ణోగ్రతల్లో మార్పులు సంభవిస్తున్నాయని.. ఎండలు మండిపోతున్నాయని పరిశోధకులు తెలిపారు.