మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 7 సెప్టెంబరు 2024 (14:04 IST)

సునీత విలియమ్స్ - బచ్ విల్మెర్ పరిస్థితేంటి : వీరు లేకుండానే కదిలిన ఆస్ట్రోనాట్ క్యాప్సుల్

starliner capsule
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్ఎస్)లో చిక్కుకునివున్న ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్, బచ్ విల్మెర్‌ల పరిస్థితిపై ఉత్కంఠత మరింతగా పెరిగిపోతుంది. తాజాగా వీరిద్దరూ లేకుండా, మిగిలిన ఆరుగురు ఆస్ట్రోనాట్స్‌తో సరికొత్త బోయింగ్ ఆస్ట్రోనాట్ క్యాప్సుల్ స్టార్ లైనర్ శనివారం భూమికి బయలుదేరింది. దీంతో సునీత విలియన్స్, బచ్ విల్మెర్ పరిస్థితి ఏంటన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్యాప్సుల్ మరో ఆరు గంటల్లో న్యూ మెక్సికో ఎడారిలో భూమిపై ల్యాండ్‌కానుంది.  
 
ఎన్ఎస్ఎస్ నుంచి స్టార్ లైనర్ అన్లాక్ కావడానికి ముందు.. ‘దానిని తిరిగి భూమికి తీసుకెళ్లండి.. గుడ్ బై టు స్టార్ లైనర్.. గుడ్లక్' అని బోయింగ్ మిషన్ కంట్రోల్‌తో సునీత విలియమ్స్ చెప్పారు. సునీత, విల్మెర్ ఇద్దరూ నిజానికి 8 రోజుల మిషన్ కోసం జూన్ నెలలో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు చేరుకున్నారు. వారం రోజుల్లోనే వారు భూమికి తిరిగి రావాల్సి ఉండగా స్టార్ లైనర్‌లో లోపాలు వారిని ప్రమాదంలోకి నెట్టేశాయి. థస్టర్ విఫలం కావడం, హీలియం లీక్ కావడంతో వారు అక్కడ చిక్కుకుపోయారు. 
 
దీంతో వారిని తీసుకురావడం ఎలానో తెలియక నాసా శాస్త్రవేత్తలు తలలు పట్టుకున్నారు. అప్పటి నుంచి వారి రాక కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. వారిని సురక్షితంగా భూమికి తిరిగి రప్పించడంపై నాసా మల్లగుల్లాలు పడింది. చివరికి వారు లేకుండానే ఇప్పుడు స్టార్ లైనర్ వెనక్కి బయలుదేరింది. వస్తూవస్తూ పాత ఐఎస్ఎస్ కొన్ని ఎక్విప్‌మెంట్స్ మాత్రం మోసుకొస్తోంది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వారిద్దరినీ వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.