ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 5 జులై 2017 (03:35 IST)

చైనా వైఫల్యం.. భారత్‌కు అద్భుత విజయం.. అవకాశాన్ని అందిపుచ్చుకుంటేనే...

భారత్‌ను చీటికీ మాటికీ కవ్విస్తూ, బెదిరిస్తూ, స్థాయిని తగ్గించే మాటలతో అవమానిస్తూ ఫోజు కొట్టే చైనాకు దిమ్మతిరిగింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లాంగ్‌మార్చ్‌ 5 రాకెట్‌ ప్రయోగం విఫలం కావడంతో ఆ దేశ అంతరిక్ష పరిశోధనలకు అడ్డంకి ఏర్పడినట్లయింది. లాంగ్‌ మార

భారత్‌ను చీటికీ మాటికీ కవ్విస్తూ, బెదిరిస్తూ, స్థాయిని తగ్గించే మాటలతో అవమానిస్తూ ఫోజు కొట్టే చైనాకు దిమ్మతిరిగింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లాంగ్‌మార్చ్‌ 5 రాకెట్‌ ప్రయోగం విఫలం కావడంతో ఆ దేశ అంతరిక్ష పరిశోధనలకు అడ్డంకి ఏర్పడినట్లయింది. లాంగ్‌ మార్చ్‌ 5 రాకెట్‌ ప్రయోగం ఎందుకు విఫలమైందో ఆ దేశ శాస్త్రవేత్తలు ఇప్పటివరకు ప్రకటించలేదు. హైనన్‌లోని అంతరిక్ష ప్రయోగకేంద్రం నుంచి ఆదివారం లాంగ్‌మార్చ్‌ రాకెట్‌ ప్రయోగాన్ని నిర్వహించారు. అయితే ప్రయోగించిన కొద్ది నిమిషాలకు ప్రయోగం విఫలమైందని అక్కడి మీడియా పేర్కొంది.
 
 
లాంగ్‌మార్చ్‌ సిరీస్‌లో ఇప్పటివరకు పలు రాకెట్లను ప్రయోగించిన చైనా ఘన విజయాలు సాధించింది. అయితే ఉన్నట్లుండి లాంగ్‌మార్చ్‌ 5 రాకెట్‌ విఫలం కావడం ఆ దేశ శాస్త్రవేత్తలను ఆందోళనలకు గురి చేస్తోంది. చైనా వైఫల్యం భారత అంతరిక్ష ప్రయోగాలకు కలసిరానుందని కొందరు విశ్లేషించారు. ఇప్పటికే ఇస్రో పలు అంతరిక్ష ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించివుండటం తెలిసిందే. చైనా తిరిగి పురోగతి సాధించేందుకు కాస్త సమయం పడుతుంది. ఈ సమయంలో భారత్‌ తన అంతరిక్ష పరిశోధనా కార్యక్రమాలను మరింత విస్తృతి చేసుకుంటే మరింత ముందుకు దూసుకుపోవచ్చని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు సూచించారు.
 
అంగారక గ్రహ పరిశోధనకు భారత్‌ చేపట్టిన మంగళ్‌యాన్‌ విజయవంతమైంది. చైనా మాత్రం ఇప్పటికీ అంగారక యాత్ర కోసం సన్నాహాలు మొదలుపెట్టకపోవడం గమనార్హం. చైనా వైఫల్యాలను భారత్‌ అందిపుచ్చుకుంటే అంతరిక్ష పరిశోధనా రంగంలో మరిన్ని మైలురాళ్లను అధిగమించగలదు. లాంగ్ మార్చ్ అనూహ్య వైఫల్యంతో భవిష్యత్తులో ఆ దేశ అంతరిక్ష కార్యక్రమాలకు ఇబ్బందికరంగా మారుతుందని అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.