శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 19 జనవరి 2017 (07:38 IST)

యుద్ధమే వస్తే 48 గంటల్లో ఢిల్లీ చేరుకుంటాం: చైనా ప్రభుత్వ టీవీని గేలి చేసిన నెటిజన్లు

భారత్‌తో యుద్ధమే గనుక సంభవస్తే తమ బలగాలు న్యూఢిల్లీని 48 గంటల్లో చేరకుంటాయని చైనా ప్రభుత్వ టీవీ సంచలన ప్రకటన చేసింది. కానీ దాన్ని లైట్ తీసుకున్న భారత నెటిజన్లు చైనా క్వాలిటీ గురించి కామెంట్ల మీద కామెంట్లతో ఆడుకుంటున్నారు. నువ్వూ నీ ముఖమూ అనేంత రేంజిల

భారత్‌తో యుద్ధమే గనుక సంభవస్తే తమ బలగాలు న్యూఢిల్లీని 48 గంటల్లో చేరకుంటాయని చైనా ప్రభుత్వ టీవీ సంచలన ప్రకటన చేసింది. కానీ దాన్ని లైట్ తీసుకున్న భారత నెటిజన్లు చైనా క్వాలిటీ గురించి కామెంట్ల మీద కామెంట్లతో ఆడుకుంటున్నారు. నువ్వూ నీ ముఖమూ అనేంత రేంజిలో చైనా గురించి ఏకిపడేశారు.
 
వివరాల్లోకి వెళితే,, చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే టీవీ ఛానెల్ ఒక ప్రకటన చేసింది. భారత్, చైనా రెండు దేశాల మధ్య ఒకవేళ యుద్ధమే గనుక వస్తే మోటరైజీ్  చేయబడిన తమ బలగాలు న్యూఢిల్లీని 48 గంటల్లో చేరుకుంటాయని, అదే తమ పారామిలిటరీ దళాలు కేవలం 10 గంటల్లో భారత రాజధానిని  చేరుకుంటాయని చైనా టీవీ ప్రకటించింది.
 
అయితే చైనా ప్రభుత్వ టీవీ వ్యాఖ్యలు అలా రాగానే భారతీయ నెటిజన్లు చైనా దళాల సామర్థ్యాన్న గేలి చేస్తూ ఆడుకున్నారు. తన దళాలను మోటరైజ్ చేయడానికి మేడ్ ఇన్ చైనా విడిభాగాలను చైనా ఖచ్చితంగా ఉపయోగించి ఉండదని,  అలా వాడినట్లయితే హిమలయాల్లోనే వారు కుప్పకూలతారని ఒకరు వ్యాఖ్యం పెట్టారు. 
 
ఇంకొకరు ఢిల్లీలో ట్రాఫిక్ జామ్ గురించి ప్రస్తావిస్తూ భారత రాజధాని అన్నివైపులా భారీ వ్యూహాత్మక ట్రాఫిక్ జామ్‌లతో పరిరక్షించబడుతోందని పాపం చైనాకు తెలిసి ఉండదంటూ జోకేశాడు.
చూస్తూంటే చైనా వార్తా చానెళ్లు పాకిస్తానీలను తమ ఎడిటర్లగా నియమించుకున్నట్లుందని మరొకరి ట్వీట్, 
 
మరొక నెటిజన్ చైనాకు భలే సలహా ఇచ్చేశాడు. ఢిల్లీ  సోమనాధ్ భారతి కుక్కలతో, కేజ్రీవాల్ ట్వీట్‌లతో, అశుతోష్ ఇంగ్లీషుతో  భద్రత కల్పించబడి ఉంది. రావడానికి అడుగు వేయడానికి ముందు ఒకటకి రెండుసార్లు ఆలోచించు మిత్రమా..
 
మరొక నెటిజన్ ట్వీట్
చైనా అసమర్థ దేశం.. భారతదళాలు బీజింగ్‌కు 6 గంటల్లో చేరుకుంటాయి. చిక్కల్లా ఏమిటంటే  ఈ రెండు సందర్భాల్లోనూ వీళ్లకూ వాళ్లకూ ఏం జరుగుతుందన్నదే.