గురువారం, 20 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : శనివారం, 25 మే 2024 (17:32 IST)

ఆ టైప్ కాస్ట్ ను బ్రేక్ చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎనర్జీకి హ్యాట్సాఫ్ : నటసింహం బాలకృష్ణ

Nandamuri Balakrishna  Kajal Aggarwal   Sasikiran Thikka  Naveen Chandra
కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. జూన్ 7న “సత్యభామ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు నటసింహం బాలకృష్ణ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నటసింహం బాలకృష్ణ మాట్లాడుతూ - ఎలక్షన్ క్యాంపెయిన్ వల్ల 45 రోజులుగా కెమెరాను చూడలేదు. ఇన్ని రోజులు మిస్ అయిన ఆ సందడి అంతా ఈరోజు సత్యభామ ఈ‌వెంట్ లో చూస్తున్నాను. సత్యభామ ట్రైలర్ లాంఛ్ కు అతిథిగా రావడం సంతోషంగా ఉంది. చిత్ర దర్శకుడు సుమన్ చిక్కాల, నిర్మాతలు బాబీ తిక్క, శ్రీనివాసరావు, సమర్పకులు శశికిరణ్ తిక్క..అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. వీళ్లకు ప్రొడక్షన్ తో పాటు డిస్ట్రిబ్యూషన్ లోనూ అనుభవం ఉంది. వీళ్లంతా కలిసి అవురమ్ ఆర్ట్స్ అనే సంస్థను స్థాపించడం. సినిమాలు నిర్మించడం సంతోషంగా ఉంది. ఉగాది పచ్చడిలా సినిమా ఇండస్ట్రీలోని అన్ని అనుభవాలు వీరికి తెలుసు. ఆ అనుభవంతోనే సత్యభామ అనే సూపర్ హిట్ సినిమా చేశారని నమ్ముతున్నాను. 
 
సత్యభామ అనే పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. పారిజాతపహరణం సమయంలో శ్రీకృష్ణుడి వెంట ఉన్నది సత్యభామ. ఆమె వెంట ఉంటే విజయం ఖాయం. సత్యభామ అనే పేరు వుమెన్ ఎంపవర్ మెంట్ కు ప్రతీకగా చెప్పుకోవాలి. శ్రీకృష్ణుడికి ఎందరు భార్యలు ఉన్నా సత్య తన చెప్పుచేతల్లో ఆయనను పెట్టుకుంది. మహిళలు ఈ రోజు పురుషుల కంటే అన్ని రంగాల్లో ముందడటం సంతోషకరం.
 
 భగవంత్ కేసరిలో నేను బనో బేటీకో షేర్ అని అంటే కాజల్ సత్యభామ సినిమాతో బనో కాచీకో షేర్ అంటూ ఫైట్స్ చేసింది. ఆర్టిస్టులు వైవిధ్యమైన చిత్రాలు చేయాలి. కాజల్ సత్యభామతో ఆ ప్రయత్నం చేసింది.  విష్ణు కెమెరా పనితనం బాగుంది. నేనూ మొదట్లో కెమెరామెన్ అవుదామని అనుకున్నా. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ చాలా బాగుంది. తెలుగు చిత్ర పరిశ్రమ దేశంలోనే నెంబర్ వన్ ఇండస్ట్రీగా ఉందంటే అందుకు కారణం మనకున్న మంచి ప్రేక్షకులు. 
 
ఈ రోజు నారద జయంతి. నాన్నగారు అన్ని రకాల క్యారెక్టర్స్ చేశారు. ఒక్క నారదుడు తప్ప. నేను శ్రీనివాస కల్యాణం సినిమాలో నారదుడిగా నటించా. నాన్న గారు చేయని క్యారెక్టర్ ఒకటి నేను చేయడం సంతృప్తినిస్తుంటుంది. సత్యభామ ట్రైలర్ చాలా బాగుంది. కాజల్ ఒక ఫైర్ బ్రాండ్. అన్ని రకాల ఎమోషన్స్ చేయగల నటి. పాత్రల ఆత్మలోకి వెళ్లి మెప్పించగలదు. 16 ఏళ్లలో అనేక వైవిధ్యమైన పాత్రల్లో నటించింది. అన్నింటిలోకి పరకాయ ప్రవేశం చేసింది. వైవాహిక జీవితంలోకి వెళ్లి ఒక బిడ్డకు జన్మనిచ్చి మళ్లీ మా భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ కు పెళ్లయ్యాక సపోర్టింగ్ క్యారెక్టర్స్ కోసం అడుగుతుంటారు. ఆ టైప్ కాస్ట్ ను బ్రేక్ చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆమెకున్న ఎనర్జీకి హ్యాట్సాఫ్. మొదటి నుంచి ఆమె సినిమాలు చూస్తున్నాను. కాజల్ తో నటించాలని ఉండేది. కానీ ఎందుకో ఆ కాంబినేషన్ కుదరలేదు. భగవంత్ కేసరిలో మేము కలిసి పనిచేయడం ఒక మంచి ఎక్సీపిరియన్స్. భగవంత్ కేసరిలో కాజల్, ఈ సినిమాలో కాజల్ ఒక్కరేనా అనిపించేలా ఉంది. సత్యభామ సినిమాకు మంచి టీమ్ పనిచేశారు. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది. జూన్ 7న థియేటర్స్ లో చూడండి. అన్నారు.
 
హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ - సత్యభామ సినిమా ట్రైలర్ బాలకృష్ణ గారి చేతుల మీదుగా రిలీజ్ కావడం సంతోషంగా ఉంది. నేను లైఫ్ లో మరో ఫేజ్ లోకి అడుగుపెట్టిన టైమ్ లో భగవంత్ కేసరి సినిమాలో నటించాను. అప్పుడు బాలకృష్ణ గారు ఇచ్చిన సపోర్ట్ తో నాకు ఎంతో కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆయన లవ్ అన్ కండిషనల్, ఎనర్జీ అన్ మ్యాచబుల్, బాలకృష్ణ గారు అన్ స్టాపబుల్. అనిల్ రావిపూడి నాకు మంచి ఫ్రెండ్. సత్యభామ కథను శశి తన టీమ్ తో వచ్చి చెప్పారు. నాకు చాలా ఎమోషనల్ గా అనిపించింది. వెంటనే ఓకే చెప్పాను. ఈ కథ మీద ఉన్న నమ్మకం గ్లింప్స్ చూసినప్పుడు రెట్టింపు అయ్యింది. టాలెంటెడ్ టీమ్ మా మూవీకి పనిచేశారు. నా కోస్టార్ నవీన్ చంద్రకు థ్యాంక్స్ చెబుతున్నా. అమర్ గా నవీన్ చంద్ర కంటే మరొకరు బాగా నటించలేరేమో. నవీన్ చంద్రతో మరోసారి కలిసి పనిచేయాలని ఆశిస్తున్నా. సత్యభామలో ప్రకాష్ రాజ్ తో మరోసారి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. శశి వల్లే నేను సత్యభామగా మారాను. తెలుగు ఆడియెన్స్ నన్ను స్టార్ హీరోయిన్ ను చేశారు. ఇన్నేళ్లుగా నాకు మీ లవ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్స్. సత్యభామకు కూడా మీ లవ్ అందిస్తారని ఆశిస్తున్నా. అన్నారు.