1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 20 మే 2024 (15:16 IST)

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

Bharatiyadu 2 tem with Mumbai Star Sports tem
Bharatiyadu 2 tem with Mumbai Star Sports tem
యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘ భార‌తీయుడు 2’. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో 1996లో విడుద‌లైన బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసిన ‘ఇండియన్’ చిత్రాన్ని ‘భార‌తీయుడు’గా విడుదల చేసింది.  ఆ మూవీకి సీక్వెల్‌గా ఇప్పుడు ‘ భార‌తీయుడు 2’ రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.
 
భార‌తీయుడు సీక్వెల్ అంటే ఎలాంటి అంచ‌నాలుంటాయో వాటిని మించేలా డైరెక్ట‌ర్ శంక‌ర్ భార‌తీయుడు 2ను విజువ‌ల్ వండ‌ర్‌గా ఆవిష్క‌రిస్తున్నారు. అవినీతికి వ్య‌తిరేకంగా పోరాడే స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు సేనాప‌తిగా క‌మ‌ల్ హాస‌న్ ప‌వ‌ర్‌ఫుల్ పెర్ఫామెన్స్ ఇవ్వ‌టానికి రెడీ అయ్యారు. ఈ సినిమా శ‌ర‌వేగంగా రూపొందుతోంది. జూలై సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
 
లేటెస్ట్‌గా ముంబైలోని స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లో ‘భారతీయుడు 2’ ప్రమోషన్స్ ను వినూత్నంగా ప్రారంభించటం విశేషం. అలాగే జూన్ 1న చెన్నైలో ఈ మూవీ ఆడియో వేడుకల ప్రముఖుల సమక్షంలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు.  మ‌న దేశాన్ని అవినీతి క్యాన్స‌ర్‌లా ప‌ట్టి పీడిస్తోంది. దీన్ని రూపుమాపటానికి సేనాపతి ఈ సీక్వెల్‌లో ఏం చేశారనేది  అందరిలో ఆసక్తిని పెంచుతోంది.  
 
క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ర‌వివ‌ర్మ‌న్  సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎ.శ్రీక‌ర ప్ర‌సాద్ ఎడిట‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా టి.ముత్తురాజ్ గా వ‌ర్క్ చేస్తున్నారు. బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ‌కుమార్‌ల‌తో క‌లిసి డైరెక్ట‌ర్ శంక‌ర్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, రెడ్ జైంట్ మూవీస్ ఈ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి.
 
న‌టీన‌టులు: క‌మ‌ల్ హాస‌న్‌, ఎస్‌.జె.సూర్య‌, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, నెడుముడి వేణు, వివేక్‌, కాళిదాస్ జ‌య‌రాం, గుల్ష‌న్ గ్రోవ‌ర్‌, స‌ముద్ర‌ఖ‌ని, బాబీ సింహ‌, బ్ర‌హ్మానందం, జాకీర్ హుస్సేన్‌, పియుష్ మిశ్రా, గురు సోమ‌సుంద‌రం, డిల్లీ గ‌ణేష్, జ‌య‌ప్రకాష్‌, మ‌నోబాల‌, అశ్వినీ తంగ‌రాజ్ త‌దిత‌రులు
 
సాంకేతిక వ‌ర్గం: క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం:  ఎస్‌.శంక‌ర్‌, స్క్రీన్ ప్లే: ఎస్‌.శంక‌ర్‌, బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ కుమార్‌, మ్యూజిక్ : అనిరుద్ ర‌విచంద్ర‌న్‌, ఎడిటింగ్:  ఎ.శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీ:  ర‌వివ‌ర్మ‌న్‌, ఆర్ట్‌:  ముత్తురాజ్‌, స్టంట్స్‌: అన‌ల్ అర‌సు, అన్బ‌రివు, రంజాన్ బుల‌ట్‌, పీట‌ర్ హెయిన్స్‌, స్టంట్ సిల్వ‌, డైలాగ్ రైట‌ర్‌:  హ‌నుమాన్ చౌద‌రి, వి.ఎఫ్‌.ఎక్స్ సూప‌ర్ వైజ‌ర్‌:  వి.శ్రీనివాస్ మోహ‌న్‌, కొరియోగ్ర‌ఫీ:  బాస్కో సీజ‌ర్‌, బాబా భాస్క‌ర్‌, పాట‌లు:  శ్రీమ‌ణి, సౌండ్ డిజైన‌ర్‌:  కునాల్ రాజ‌న్‌, మేక‌ప్ :  లెగ‌సీ ఎఫెక్ట్‌-వాన్స్ హర్ట్‌వెల్‌- ప‌ట్ట‌ణం ర‌షీద్‌, కాస్టూమ్ డిజైన్‌:  రాకీ-గ‌విన్ మ్యూగైల్‌- అమృతా రామ్‌-ఎస్‌బి స‌తీష‌న్‌-ప‌ల్లవి సింగ్-వి.సాయి, ప‌బ్లిసిటీ డిజైన‌ర్: క‌బిల‌న్ చెల్ల‌య్య ,పి.ఆర్‌.ఒ (తెలుగు):  నాయుడు సురేంద్ర కుమార్‌, ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  సుంద‌ర్ రాజ్‌, హెడ్ ఆఫ్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌:  జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్‌, రెడ్ జైంట్ మూవీస్‌:  సెన్‌బ‌గ మూర్తి, నిర్మాత‌:  సుభాస్క‌ర‌న్‌.