సోమవారం, 7 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 ఏప్రియల్ 2025 (14:54 IST)

కేరళ సీఎంకు షాకిచ్చిన కేంద్రం.. కుమార్తె వీణ వద్ద విచారణకు ఓకే!

Pinarayi Vijayan
కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు కేంద్రం గట్టి షాకిచ్చింది. గత కొన్ని రోజులుగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయన్ కుమార్తె టి.వీణపై నమోదైన అభియోగాలపై విచారించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ అక్రమ లావాదేవీల్లోఆమె ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు రావడంతో కంపెనీల చట్టం ఉల్లంఘన కింద గతంలో ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ప్రత్యేక న్యాయస్థానంలో చార్జిషీట్ సమర్పించిన నేపథ్యంలో ఆమెపై విచారణకు కేంద్రం తాజాగా అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇది కేరళ రాష్ట్రంలోని అధికారపక్షం లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)ను కలవరపాటుకు గురిచేసింది. 
 
'నువ్వు చాలా అందంగా ఉంటావు.. నిన్ను ఎవరైనా ప్రేమిస్తే నేనేం చేయాలి' : యువతి సూసైడ్ 
 
బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యంలో దూరపు బంధువుతో ఏర్పడిన పరిచయం చివరకు ఓ యువతి ప్రాణంతీసింది. ఆ పరిచయం ప్రేమగా మారి రహస్యంగా వివాహం చేసుకున్నారు. చివరకు కట్టుకున్న భర్తే అనుమానించి వేధించసాగాడు. పరాయి పురుషులకు అందంగా కనిపించకూడదనే ఉద్దేశంతో తన అందమైన జుత్తును కూడా త్యాగం చేసింది. ఇంట్లో గొడవపడిమరీ గుండు చేయించుకుంది. అయినా భర్త తనతో మాట్లాడటం లేదని మనస్తాపం చెంది ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయింది. బాధితురాలి ఫోనులో ఫోటోలు చూశాకే ఆమె ప్రేమ, పెళ్ళి వివరాలు తమకు తెలిశాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఢిల్లీలో సంచలనంగా మారిన ఈ యువతి ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే, 
 
న్యూఢిల్లీకి చెందిన ప్రీతి కూశ్వాహ (18) అనే యువతి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. రెండేళ్ళ క్రితం సొంతూళ్లలో జరిగిన శుభకార్యానికి హజరైంది. ఆ వేడుకలో దూరపు బంధువు రింకూతో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇంట్లో వాళ్ళకు తెలియకుండా ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియకుండా దాచిపెట్టి ఎప్పట్లాగే ఇంట్లో ఉంటున్నారు. ఇద్దరూ రహస్యంగా కలుసుకుంటూ, ఫోనులో మాట్లాడుకోసాగారు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. అదేసమయంలో భర్త రింకూ భార్య ప్రీతిని అనుమానించడం మొదలుపెట్టాడు.
 
'నువ్వు చాలా అందంగా ఉంటావు.. ఇతరులు ఎవరైనా నిన్ను ప్రేమిస్తే నేను ఏం చేయాలి' అంటూ వేధించసాగాడు. దీంతో తను అందంగా కనిపించకూడదనే ఆలోచనతో ప్రీతి గుండు చేయించుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు వారించినా వినకుండా సెలూన్‌కు వెళ్ళేందుకు ప్రయత్నించడంతో చివరకు ఆమె సోదరుడే గుండు గీశాడు. ఆ తర్వాత కూడా రింకూ తనతో మాట్లాడకపోవడం, తను ఫోన్ చేస్తే కట్ చేయడంతో మానసికంగా కుంగిపోయింది. చివరకు తన నెంబర్ కూడా బ్లాక్ చేయడంతో తనకు ఆత్మహత్యే శరణ్యమని భావించింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో తనగదిలో ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనపై బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.