ప్రపంచ ఆరోగ్య దినోత్సవంను ఏప్రిల్ 7న జరుపుకుంటున్న వేళ, మంచి ఆరోగ్యం అంటే ఎక్కువ కాలం జీవించడం మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన మరియు మెరుగైన జీవితాన్ని గడపడం గురించి అని మనకు గుర్తు చేస్తుంది. సమతుల్య ఆహారం మొత్తం ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి పోషకాహారం అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి. బాదంపప్పు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను రోజువారీ భోజనంలో చేర్చడం అతి సులభమైనప్పటికి, ప్రభావవంతమైన మార్గం. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బాదంపప్పు అయిన కాలిఫోర్నియా బాదంపప్పులు ప్రోటీన్, డైటరీ ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, జింక్, విటమిన్ ఈ వంటి 15 ముఖ్యమైన పోషకాల సహజ వనరు, ఇవి ఆరోగ్యకరమైన జీవనశైలికి తెలివైన జోడింపుగా ఉంటాయి.
తరతరాలుగా, మన తల్లులు, అమ్మమ్మలు బాదంపప్పు యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ఇప్పుడు, శాస్త్ర పరిజ్ఙానం వారి విజ్ఞానాన్ని సమర్థిస్తుంది. దాదాపు 200 కంటే ఎక్కువ ప్రచురించబడిన పరిశోధన అధ్యయనాలు, శక్తి మరియు రోగనిరోధక శక్తిని అందించడం నుండి మెరుగైన గుండె ఆరోగ్యం, రక్తంలో చక్కెర స్థాయిలు , బరువు నిర్వహణ వరకు బాదం యొక్క ఆరోగ్య ప్రయోజనాలను వెల్లడించాయి. బాదంపప్పులోని ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఈ మెరిసే చర్మానికి , వృద్ధాప్య వ్యతిరేక ప్రయోజనాలకు దోహదం చేస్తాయి. భారతీయుల కోసం ఐసిఎంఆర్- ఎన్ఐఎన్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు, సమతుల్య ఆహారంలో పోషకాహార పరంగా రోజువారీ జోడింపుగా బాదంను సిఫార్సు చేస్తున్నాయి, ఇవి మొక్కల ప్రోటీన్ యొక్క మూలంగా , ఆరోగ్యకరమైన చిరుతిండిగా నిలుస్తున్నాయి. డీప్-ఫ్రైడ్ స్నాక్స్‌ను గింజలతో మార్చుకోవాలని ఆహార మార్గదర్శకాలు సిఫార్సు చేస్తున్నాయి ఎందుకంటే అవి మొత్తం ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని మాక్స్ హెల్త్‌కేర్, రీజినల్ హెడ్ - డైటెటిక్స్ రితికా సమద్దర్ మాట్లాడుతూ, “ఆహారపు అలవాట్లలో మార్పులు , నిశ్చల జీవనశైలి భారతదేశంలో ఊబకాయం, హృదయ సంబంధ వ్యాధులు మరియు మధుమేహం పెరగడానికి దారి తీస్తున్నాయి , దీని వలన మొత్తం ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యంగా మారింది. పోషకాహారం మంచి ఆరోగ్యానికి పునాది అని మరియు చిన్న, బుద్ధిపూర్వక ఎంపికలు అంటే ఎక్కువగా కూరగాయలు, పండ్లు మరియు బాదం వంటి పోషకాల్ అధికంగా కలిగిన గింజలను చేర్చడం వంటివి అధిక తేడాను కలిగిస్తాయని నేను ఎల్లప్పుడూ నా క్లయింట్‌లకు సలహా ఇస్తుంటాను. బాదం ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే అవి టోటల్, ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను, గుండెకు హాని కలిగించే వాపును తగ్గించడంలో సహాయపడతాయి, ఇవి సమతుల్య ఆహారంలో తెలివైన జోడింపుగా ఉంటాయి" అని అన్నారు.
న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణ స్వామి మాట్లాడుతూ "ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వేళ, భారతదేశంలో పెరుగుతున్న ఊబకాయం సంక్షోభాన్ని పరిష్కరించడం చాలా ముఖ్యం, దీనికి నిశ్చల జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు , ఇతర ముఖ్యమైన పోషకాలు లేని కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే ఆహారాలు కారణమవుతున్నాయి. ప్రోటీన్, డైటరీ ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు సూక్ష్మపోషకాలు కలిగిన పోషకాలు అధికంగా ఉండే ఆహారంతో ప్రభావవంతమైన రీతిలో బరువు నిర్వహణ ప్రారంభమవుతుంది. ఒక సులభమైనప్పటికే శక్తివంతమైన దశ ఏమిటంటే ఒకరి దినచర్యలో కొన్ని బాదంపప్పులను జోడించడం. 15 ముఖ్యమైన పోషకాలతో నిండిన బాదంపప్పులు సంతృప్తిని పెంచడానికి, మొత్తం కేలరీల తీసుకోవడం తగ్గించడానికి, బరువు నిర్వహణకు మద్దతు ఇస్తాయి. అవి చాలా వైవిధ్యంగా ఉంటాయి. ఏ రూపంలోనైనా ఆస్వాదించవచ్చు. కాబట్టి, మరలా ఆకలి వేసినప్పుడు - ముఖ్యంగా భోజనాల మధ్య ఆకలి వేసినప్పుడు ఆరోగ్యకరమైన ఎంపిక కోసం జంక్ లేదా వేయించిన ఆహారాలకు బదులుగా కొన్ని బాదంపప్పులను తీసుకోండి" అని అన్నారు.
ఎంబిబిఎస్ మరియు పోషకాహార నిపుణురాలు డాక్టర్ రోహిణి పాటిల్ మాట్లాడుతూ, "జీవనశైలి సంబంధిత వ్యాధుల పెరుగుదలతో, పోషకాహారం ఎన్నడూ లేనంత ముఖ్యమైనదిగా మారింది. ప్రపంచ మధుమేహ రాజధానిగా పిలువబడే భారతదేశంలో ప్రతిరోజూ అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి, చాలా మంది వ్యక్తులు ప్రీ-డయాబెటిస్ దశలో ఉన్నారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక మార్గం ఆరోగ్యకరమైన స్నాక్స్‌తో ప్రారంభించి తెలివైన ఆహార ఎంపికలు చేసుకోవడం. ప్రాసెస్ చేసిన లేదా చక్కెర కలిగిన ఆహారాలను ఎంచుకోవడానికి బదులుగా, పండ్లు, కూరగాయలు , బాదం వంటి పోషకాలు అధికంగా ఉండే ప్రత్యామ్నాయాలను ఎంచుకోండి. సహజ ప్రోటీన్ , ఫైబర్‌తో నిండిన బాదం, ఆరోగ్యకరమైన రీతిలో రక్తంలో చక్కెర స్థాయిలకు మద్దతు ఇవ్వడంలో సహాయపడుతుంది , టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర నిర్వహణలో సహాయపడుతుంది" అని అన్నారు.
బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ మాట్లాడుతూ, "పని మరియు కుటుంబాన్ని సమతుల్యం చేసుకోవడం సవాలుతో కూడుకున్నది కావచ్చు, కానీ చిన్న, జాగ్రత్తగా తీసుకునే ఎంపికలు పెద్ద తేడాను కలిగిస్తాయి. నేను ఉత్సాహంగా ఉండటానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం , సమతుల్య ఆహారం తీసుకోవడం , ఒత్తిడి నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తాను. నా దినచర్యలో కొన్ని కాలిఫోర్నియా బాదంపప్పులను చేర్చడం నన్ను ముందుకు నడిపించే ఒక సాధారణ అలవాటు - అవి షూటింగ్ లలో ఎక్కువ గంటలు గడపడానికి నాకు సహాయపడే కొన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి ఉన్నాయి. ఒక తల్లిగా, నేను ఈ అలవాట్లను నా కుమార్తెకు కూడా అందిస్తున్నాను, ఆమెకు జాగ్రత్తగా తినడం , చురుకుగా ఉండటం యొక్క ప్రాముఖ్యతను నేర్పుతున్నాను. ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, జీవితంలో ఎంత బిజీగా ఉన్నా, ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా మార్చడానికి కట్టుబడి ఉందాం , తదుపరి తరాన్ని కూడా అదే విధంగా చేయడానికి ప్రేరేపిద్దాం" అని అన్నారు.
ప్రముఖ దక్షిణ భారత నటి శ్రియ శరణ్ మాట్లాడుతూ, "ఉదయమే పనివేళలు ప్రారంభం కావటం, సుదీర్ఘ రిహార్సల్స్ , డిమాండ్ తో కూడిన షూటింగ్‌లతో, ఫిట్‌గా మరియు ఉత్సాహంగా ఉండటం కేవలం ఒక ఎంపిక కాదు - ఇది చాలా అవసరం. అందుకే నేను నా వ్యాయామాలు , నా ఆహారం రెండింటిపై దృష్టి పెడుతుంటాను. నన్ను ముందుకు నడిపించే ఒక సాధారణ అలవాటు ఏమిటంటే, నా దినచర్యలో కొన్ని కాలిఫోర్నియా బాదంపప్పులను చేర్చడం. అవి ముఖ్యమైన పోషకాలతో నిండి ఉన్నాయి, సెట్‌లో ఎక్కువ గంటలు గడపడానికి నాకు సహాయపడతాయి , మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. బాదంపప్పు తినడం నా అమ్మ నాకు నేర్పిన అలవాటు, నేను సంవత్సరాలుగా దానిని అనుసరిస్తున్నాను. అవి నా ఇష్టమైన చిరుతిండి . మీరు ఇప్పటికే చేయకపోతే, దీన్ని ఒకసారి ప్రయత్నించండి - అది చేసే తేడాను చూసి మీరు ఆశ్చర్యపోతారు!" అని అన్నారు.
మంచి ఆరోగ్యం అనేది ఆలోచనాత్మక ఎంపికలు మరియు సమతుల్య పోషకాహారం ద్వారా రూపొందించబడిన ప్రయాణం అని ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం గుర్తు చేస్తుంది. కాలిఫోర్నియా బాదంపప్పులను మన రోజువారీ ఆహారంలో చేర్చడం అనేది సమగ్ర శ్రేయస్సు వైపు ఒక సరళమైన కానీ శక్తివంతమైన ముందడుగు. సంప్రదాయం, శాస్త్రం రెండింటి మద్దతుతో, బాదంపప్పులు అనుకూలమైన, ఆరోగ్యకరమైన మార్గంలో అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఒకేసారి, ఒక గుప్పెడు బాదములతో మనల్ని లోపల నుండి పోషించే శాశ్వత మార్పులకు కట్టుబడి ఉందాం.