బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (18:27 IST)

బాదంపప్పుల చక్కదనంతో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకోండి

Almonds
"ఆరోగ్యమే మహాభాగ్యం" అనే సామెత మన శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది, ఎందుకంటే ఇది మన మొత్తం ఆరోగ్యం, జీవన నాణ్యతను నేరుగా ప్రభావితం చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవంను ఏప్రిల్ 7న "నా ఆరోగ్యం, నా హక్కు" అనే థీమ్‌తో ఈ సంవత్సరం జరుపుకుంటున్నారు. మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత, ప్రాథమిక హక్కు అనే ఆలోచనను ఇది నొక్కి చెబుతుంది. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమతుల్య ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. మన ఆహారంలో పోషకమైన బాదంపప్పులను చేర్చుకోవడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణ, గుండె ఆరోగ్యం, చర్మ ఆరోగ్యం, బరువు నిర్వహణ వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించవచ్చు.
 
బాదంపప్పులలో విటమిన్ ఇ, మెగ్నీషియం, ప్రొటీన్, రిబోఫ్లావిన్, జింక్‌తో సహా 15 ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. బాదంపప్పులో ఉండే మెగ్నీషియం, ప్రోటీన్, విటమిన్లు B2, E స్థిరమైన శక్తి స్థాయిలకు దోహదం చేస్తాయి. అయితే రాగి, జింక్, ఫోలేట్, ఐరన్ రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, శక్తి- పోషణ యొక్క ఈ పవర్‌హౌస్‌లు, సంతృప్తికరమైన లక్షణాల కారణంగా బరువు నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలపై కార్బోహైడ్రేట్ ఆహారాల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
 
ఈ గింజలను సమతుల్య ఆహారంలో చేర్చడం వల్ల LDL కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అదనంగా, బాదంలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాబట్టి, మీ రోజువారీ ఆహారంలో బాదంపప్పులను చేర్చడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. 
 
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఢిల్లీలోని మాక్స్ హెల్త్‌కేర్‌లోని రీజనల్ హెడ్ - డైటెటిక్స్ రితికా సమద్దర్ మాట్లాడుతూ, "నేటి జీవనశైలిలో, మన ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ఒక సవాలుగా ఉంటుంది. ముఖ్యంగా పోషకాహారాన్ని నిర్వహించడం విషయానికి వస్తే ఇది పెను సవాలుగానే నిలిస్తోంది. ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నాడు, మనం మన ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించి, మనస్పూర్తిగా దానికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయాలి. ప్రోటీన్, డైటరీ ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు E, B2, అలాగే మెగ్నీషియం వంటి ఖనిజాలు నిండిన బాదం ఒక అనుకూలమైన, ఆరోగ్యకరమైన చిరుతిండిగా ఉపయోగపడుతుంది" అని అన్నారు. 
 
బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ మాట్లాడుతూ, "వేగవంతమైన వినోద ప్రపంచంలో చురుకుగా, ఉత్సాహంగా ఉండటం అవసరం. రెగ్యులర్ వ్యాయామం, సమతుల్య ఆహారం చాలా ముఖ్యమైనవి. బాదంపప్పును నా దినచర్యలో చేర్చడం వల్ల అవసరమైన పోషకాహారం, దీర్ఘకాల శక్తిని అందిస్తుంది. కొన్ని బాదంపప్పులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ శుభ్రమైన ఆహారం తీసుకోవడం, బాదం వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం, క్రమంతప్పకుండా శారీరక వ్యాయామం చేయడం ద్వారా మన ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇద్దాం" అని అన్నారు. 
 
ప్రఖ్యాత న్యూట్రిషన్ అండ్ వెల్‌నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ, "బాదం, ఒక అద్భుతమైన పోషక శక్తి, ఇది మన మొత్తం శ్రేయస్సును మెరుగుపరిచే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. బాదం పప్పును మన దినచర్యలలో చేర్చడం ద్వారా మెరుగైన ఆరోగ్యం పొందవచ్చు.  ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క 'నా ఆరోగ్యం, నా హక్కు' నేపథ్యంకు అనుగుణంగా మనం ప్రయత్నాలు చేయాలి " అని అన్నారు. 
 
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా, సెలబ్రిటీ పిలాట్స్ మాస్టర్ ఇన్‌స్ట్రక్టర్ యాస్మిన్ కరాచీవాలా మాట్లాడుతూ, “ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి సమతుల్య ఆహారం, స్థిరమైన వ్యాయామం చాలా ముఖ్యమైనవి. కనీసం ఐదు రోజుల వ్యాయామం, ఇంట్లో వండిన భోజనం ద్వారా పోషకాలు అధికంగా ఉండే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. బాదం, పచ్చి ఆకు కూరలు, సీజనల్ ఫ్రూట్స్ వంటి ఆహారపదార్థాలను చేర్చుకోవడం వల్ల మన ఆహారంలో అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.."అని అన్నారు 
 
ప్రముఖ దక్షిణ భారత నటి ప్రణీత సుభాష్ మాట్లాడుతూ, "బాదంపప్పును నా రెగ్యులర్ రొటీన్‌లో చేర్చుకోవడం వల్ల నా ఆరోగ్యం, శక్తిస్థాయిలు గణనీయంగా పెరిగాయి. రోజంతా నన్ను చురుకుగా ఉంచడంలో, ప్రకాశవంతమైన చర్మాన్ని నిర్వహించడంలో బాదం ముఖ్య పాత్రను పోషిస్తుంది" అని అన్నారు. ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నాడు బాదం వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను స్వీకరించడం సరైన ఆరోగ్యం కోసం మన సాధనలో కీలకంగా ఉపయోగపడుతుంది.