శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 21 మే 2024 (14:18 IST)

టాలీవుడ్ మారాలంటున్న కాజల్ అగర్వాల్ !

Kajal Aggarwal
Kajal Aggarwal
నటి కాజల్ అగర్వాల్ పెండ్లి అయిన తర్వాత కూడా బిజీ అయింది. పెండ్లి తర్వాత తన భర్త సపోర్ట్ తో సినిమాలు చేస్తున్నాననీ పలు సార్లు వెల్లడించింది. తాజాగా ఆమ లేడీ ఓరియెంటెడ్ సినిమా సత్యభామలో నటించింది. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగం పెండ్లి తర్వాత నటన గురించి ప్రస్తావిస్తూ.. పెండ్లి అనేది నటనకు అవరోధం కాదని తేల్చి చెప్పింది. 
 
బాలీవుడ్ లో పెండ్లి అయిన కూడా హీరోయిన్లు సినిమాలు చేస్తుంటారు. అక్కడ నిబంధనలు ఏమీ వుండదు. టాలెంట్ చూస్తారు. కానీ టాలీవుడ్ లో విరుద్ధంగా వుంది. పెండ్లయిన వారిని సినిమాలోకి తీసుకోవడానికి మేకర్స్ ఆలోచిస్తారు. త్వరలో టాలీవుడ్ లో మార్పు వస్తుందని భావిస్తున్నాను అంది. అదేవిధంగా షూటింగ్ వుంటే తన భర్త ఒక్కోసారి వస్తారు. రాకపోతే ఫోన్ లో మాట్లాడుకుంటామని చెప్పింది.