1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 16 మే 2024 (17:19 IST)

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

Kajal Aggarwal
Kajal Aggarwal
కాజల్ అగర్వాల్ లీడ్ రోల్‌లో నటించిన  సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషించాడు.. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. “సత్యభామ” సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు హైదరాబాద్ లో  “సత్యభామ” సినిమా మ్యూజికల్ ఈవెనింగ్ ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు..' పాట రిలీజ్ చేశారు. 
 
ఈ కార్యక్రమంలో గర్ల్స్, బాయ్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల, అండ్ టీమ్ తమ పాటలతో హుషారెత్తించారు. లైవ్ ఆర్కెస్ట్రాలో సింగర్స్ పాడిన సాంగ్స్ ను ఈవెంట్ కు వచ్చిన ఆడియెన్స్ ఎంజాయ్ చేశారు. ఈ మ్యూజికల్ ఈవెంట్ లో స్పెషల్ కాంటెస్ట్ నిర్వహించి విజేతలకు గిఫ్ట్స్ అందజేశారు.
 
అనంతరం కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ - "సత్యభామ" మ్యూజికల్ ఈవెనింగ్ ఈవెంట్ జరుపుకోవడం హ్యాపీగా ఉంది. 'వెతుకు వెతుకు..' నా సోలో సాంగ్. ఈ పాట చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేశాం. సత్యభామగా నటించడం ఛాలెంజింగ్ గా అనిపించింది. ఇలాంటి క్యారెక్టర్ నా కెరీర్ లో చేయడం తొలిసారి. మా సినిమాలో ఎమోషన్, డ్రామా, పవర్ ఫుల్ నెస్ అన్నీ ఉన్నాయి. "సత్యభామ" మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ సినిమా నా కెరీర్ లో ఓ స్పెషల్ ప్రాజెక్ట్ గా భావిస్తున్నా. సినిమా రిలీజ్ కోసం ఎగ్జైటెడ్ గా ఉన్నాను. నేను బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత చేసిన మూవీ ఇది. ఈ సబ్జెక్ట్ చాలా పర్పస్ ఫుల్ గా, రిలవెంట్ గా అనిపించింది. అమ్మాయిలు తప్పకుండా ఈ మూవీ చూడాలి. అమ్మాయిలు షీ సేఫ్ యాప్ ను ఎలా ఉపయోగించి సేఫ్ గా ఉండాలో మా మూవీలో చూపించాం. ఈ అంశం గురించి సినిమాలో వివరంగా తెలుసుకుంటారు. మన అమ్మాయిలు క్షేమంగా ఉండాలనే పాయింట్ ఈ కథలో నన్ను ఆకట్టుకుంది. మహిళలు కూడా ఎంతో శక్తిమంతులు అని చూపిస్తున్నాం. సత్యభామ క్యారెక్టర్ శక్తి కండబలంతో పాటు బుద్ధిబలంలోనూ ఉంటుంది. సత్యభామ చూసి మీ స్పందన తెలియజేస్తారని ఆశిస్తున్నా. అన్నారు.
 
'వెతుకు వెతుకు..' పాటను ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పాడటం విశేషం. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. అమ్మాయిలపై జరుగుతున్న హత్యాయత్నాల నేపథ్యంలో..బాధిత యువతులను చూసి చలించిపోతుంది పోలీస్ ఆఫీసర్ సత్యభామ. ఆ నేరస్తులను పట్టుకోవడానికి సిద్ధమవుతుంది. ఆ సందర్భంలో వచ్చే పాట ఇది. 'వెతుకు వెతుకు వెతుకు వెనకాడకుండ వెతుకు, వెతుకు వెతుకు వెతుకు ఆశ కొరకు నిరాశలోనే వెతుకు. కాంతి కొరకు నిశీధిలోనే వెతుకు...' అంటూ ఇన్ స్పైర్ చేసేలా సాగుతుందీ పాట.