శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 మే 2024 (19:49 IST)

ఎండాకాలంలో చర్మ సంరక్షణకు ఏం చేయాలి... ఈ జాగ్రత్తలు పాటిస్తే..?

ఎండాకాలంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వేసవి ప్రతాపం నుంచి మన చర్మాన్ని కాపాడుకోవడానికి వీలుంటుంది. ఎండాకాలంలో చర్మాన్ని కాపాడుకోవడానికి ముఖ్యంగా మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 
 
ముఖ్యంగా ఎండాకాలం శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. తగినన్ని మంచినీళ్లు తాగాలి. ఎండాకాలం తగినన్ని మంచినీళ్లు తాగడంవల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

ఇక ఎండలలో బయటకు వెళ్లాల్సి వస్తే తప్పకుండా సన్ స్క్రీన్ లోషన్స్ ఉపయోగించాలి. సూర్యుని తీవ్రమైన కిరణాల నుండి సన్ స్క్రీన్ లోషన్స్ చర్మాన్ని కాపాడతాయి.  
 
చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి కొబ్బరి నీళ్లు, పళ్ళ రసాల వంటివి తాగాలి. టమాటో, కీరా దోసకాయ, బొప్పాయి వంటివి తినటంతో పాటు కుదిరినప్పుడు వీటితో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఇంట్లో కూడా స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్ వాడడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది.