గురువారం, 2 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 25 మే 2024 (20:51 IST)

కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు

కొలెస్ట్రాల్ అనేది శరీరం కొత్త కణాలను తయారు చేయడానికి, హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి అవసరం. ఐతే మంచి కొవ్వు కాకుండా శరీరంలో చెడు కొవ్వు పరిమాణం పెరిగుతూ పోయిందంటే అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు తినకూడని పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము.
 
అధిక కొలెస్ట్రాల్ రోగులు బాగా వేయించిన, బాగా కాల్చిన ఆహార పదార్థాలు తినరాదు.
వెన్న, చీజ్ తింటే కొవ్వు స్థాయిలు పెరుగుతాయి.
ప్రాసెస్ చేసిన మాంసాలు దూరం పెట్టేయాలి.
చక్కెర పానీయాలు తాగితే కొలెస్ట్రాల్ సమస్యలున్నవారు ఇబ్బందుల్లో పడతారు.
వైట్ బ్రెడ్, పాస్తా వంటి వాటికి ఎంతదూరం పెడితే అంత మంచిది.
శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, తెల్ల రొట్టె, పాస్తా వంటివి రక్తంలో చక్కెరను ఆకస్మికంగా పెంచుతాయి.