గురువారం, 20 జూన్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 మే 2024 (18:09 IST)

కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..

Kidney
కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకోవాలంటే ఈ ఆహారం తీసుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆకుపచ్చని కూరగాయలు మూత్రపిండాలకు చాలా మేలు చేస్తాయి. కిడ్నీ ఆరోగ్యానికి విటమిన్ బీ6, బీ9, సీ, విటమిన్ కె ముఖ్యమైనవి. ఈ విటమిన్లన్నీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడతాయి. 
 
రోజూ ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే కిడ్నీ సంబంధిత సమస్యలు లేకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, అల్లిసిన్ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 
కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో క్యాబేజీ కూడా ఎంతో మేలు చేస్తుంది. యాపిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరాన్ని ఫిట్ గా ఉంచడమే కాకుండా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.