శనివారం, 21 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 15 నవంబరు 2016 (12:18 IST)

వాణిజ్య యుద్ధం చేయాలని చూస్తే సహించం.. ట్రంప్‌కు చైనా వార్నింగ్

తమ దేశంతో వాణిజ్య యుద్ధం ప్రారంభించాలని చూస్తే ఏమాత్రం సహించబోమని, తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు డ్రాగన్ దేశం చైనా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.

తమ దేశంతో వాణిజ్య యుద్ధం ప్రారంభించాలని చూస్తే ఏమాత్రం సహించబోమని, తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు డ్రాగన్ దేశం చైనా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.
 
తమ మొదటి అడుగు ఐఫోన్లపై ఉంటుందని, వాణిజ్యపరంగా అమెరికా ఏ మాత్రం ఒత్తిడి పెట్టాలని భావించినా, చైనా వ్యాప్తంగా ఐఫోన్ అమ్మకాలను, ఫోన్ల వాడకాన్ని నిషేధిస్తామని స్పష్టం చేసింది.
 
చైనా ఉత్పత్తులు అమెరికాలో ఎంతగా మార్కెట్ అవుతున్నాయో, అమెరికాకు చెందిన ఉత్పత్తులు కూడా అంతేలా చైనాకు వస్తున్నాయని గుర్తు చేసిన అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్, ట్రంప్ రానున్నాడన్న వార్తలతో చైనా వ్యాపారులు కొంతమేరకు ఆందోళన చెందుతున్నారని పేర్కొంది.
 
త్వరలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ ను డ్రాగన్ కంట్రీ చైనా తొలిసారిగా హెచ్చరించింది. తమ దేశంతో ట్రేడ్ వార్ ను ప్రారంభించాలని చూస్తే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పేర్కొంది.