బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 23 అక్టోబరు 2018 (11:47 IST)

55 కిలోమీటర్ల పొడవు.. చైనా భారీ బ్రిడ్జ్ ప్రారంభం.. జిన్ పింగ్ ప్రారంభించారు..

చైనా వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతనెలలో చైనా, హాంకాంగ్ లకు కలిపే హైస్పీడ్ రైల్వే మార్గాన్ని కూడా చైనా ప్రారంభించింది. అనంతరం చైనా భారీ బ్రిడ్జ్‌ను ప్రారంభించడం గమనార్హం. తాజాగా 55 కిలోమీటర్లు పొడవుతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర బిడ్జ్‌ను చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రారంభించారు. 
 
ఈ బ్రిడ్జ్ హాంకాంగ్, మకావూతో పాటు పాటు చైనా ప్రధాన భూభాగాన్ని కలుపుతుంది. జుహాయ్‌లో ఈ బ్రిడ్జి ప్రారంభ కార్యక్రమం జరిగింది. 55 కిలోమీటర్ల పొడవుతో.. రోడ్డు బ్రిడ్జ్‌తో పాటు నీటిలో సొరంగం ద్వారా నిర్మితమైన ఈ బ్రిడ్జ్ ఇస్తూరీ నదిని దాటుతూ హాంకాంగ్ లాంతావ్ ద్వీపం, జుహాయ్, మకావూలను కలపనుంది. బ్రిడ్జ్‌పై ప్రయాణించడానికి పలు ఆంక్షలు ఉన్నాయని సమాచారం. 
 
అయితే హాంకాంగ్‌తో చైనా రవాణా మార్గాలను మెరుగుపరుచుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హాంకాంగ్‌లో తన బలగాలను మోహరించేందుకు చైనా ఈ బ్రిడ్జ్‌ను నిర్మించిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.