మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 ఆగస్టు 2020 (17:29 IST)

మొన్న చికెన్‌లో కరోనా ఆనవాళ్లు.. ఇప్పుడేమో రొయ్యల్లో కోవిడ్..?

మొన్నటికి మొన్న బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకుంటున్న చికెన్‌లో కరోనా ఆనవాళ్లు ఉన్నాయని చైనా బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. రొయ్యల్లో చైనా, ఈక్వెడార్ రొయ్యల మీద కూడా కరోనా ఆరోపణలు చేసింది. 
 
ప్రపంచంలో అనేక దేశాలకు ఈక్వెడార్ రొయ్యలను ఎగుమతి చేస్తుంది. ఏ దేశం కూడా ఇప్పటి వరకు ప్యాకింగ్‌లో కరోనా వైరస్ ఉన్నట్టుగా చెప్పలేదు. ఈక్వెడార్ నుంచి దిగుమతి చేసుకున్న రొయ్యల ప్యాక్‌లో కరోనా వైరస్ ఉన్నట్టుగా అధికారులు గుర్తించారని చైనా ఆరోపించింది. 
 
దీనిపై ఈక్వెడార్ ప్రొడక్షన్ మంత్రి స్పందిస్తూ.. కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మా దేశంలో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నాం. నియమాలు పాటిస్తూనే ఎగుమతులు చేస్తున్నాం. మా దేశం దాటి వెళ్లిన వస్తువులకు ఏమౌతుందనేది మా బాధ్యత కాదు' అని వ్యాఖ్యానించారు. ఈక్వెడార్ మినిస్టర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.