శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 ఆగస్టు 2020 (10:56 IST)

కరోనా వైరస్ విజృంభణ.. 7లక్షల మంది మృతి.. నాలుగో స్థానంలో భారత్

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. ఈ మహమ్మారి ఇప్పటివరకు వరకు 7 లక్షల 53 వేల మందిని పొట్టనబెట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 2,10,91,079 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7,53,479 మంది బాధితులు మరణించారు. 
 
అత్యధిక మరణాలతో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. అమెరికాలో 1,70,415 మంది మరణించగా, 1,05,564 మరణాలతో బ్రెజిల్‌, 55,293 మృతులతో మెక్సికో, 47,033 మందితో భారత్ తొలి నాలుగు స్థానంలో ఉన్నాయి.
 
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 64,19,775 యాక్టివ్ కేసులు ఉండగా, 1,39,17,825 మంది కోలుకున్నారు. అమెరికాలో 64,15,666 మంది కరోనా బారినపడగా, బ్రెజిల్‌లో 32,29,621, భారత్‌లో 24,59,613, రష్యాలో 9,07,758, దక్షిణాఫ్రికాలో 5,72,865 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.