మంగళవారం, 8 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 6 జులై 2016 (16:41 IST)

దెయ్యాలు ఊయల ఊగాయంటే నమ్ముతారా? అమెరికాలో అదే జరిగింది వీడియా చూడండి!

దెయ్యాలు ఊయల ఊగాయంటే నమ్ముతారా? అలాంటి ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఊయల తనంతట తానుగానే ఊగడం గమనించిన ఓ వ్యక్తి ఆ విచిత్రాన్ని వీడియోలో బంధించాడు. అయితే ఆ వీడియోలో దెయ్యాల రూపం కనిపించలేదు కానీ.. ఊయల మ

దెయ్యాలు ఊయల ఊగాయంటే నమ్ముతారా? అలాంటి ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఊయల తనంతట తానుగానే ఊగడం గమనించిన ఓ వ్యక్తి ఆ విచిత్రాన్ని వీడియోలో బంధించాడు. అయితే ఆ వీడియోలో దెయ్యాల రూపం కనిపించలేదు కానీ.. ఊయల మాత్రం బలమైన గాలులు లేకపోయినా.. ఓ మనిషి కూర్చుని ఊయలాడేలా ఊగిపోయింది. ఈ తతంగాన్ని వీడియో తీసిన ఆ వ్యక్తి ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడు. 
 
ఊయల ఊగడం అంటే పిల్లలకున్న ఇష్టం తెలిసిందే. అందుకే తన పిల్లలతో కలిసి బీచ్ అమెరికాలోని రోడే ఐలాండ్‌లో వార్విక్ అనే ప్రాంతానికి వెళ్లామని.. కానీ అక్కడ జరుగుతున్నది చూసి షాక్ తిన్నామని స్కాట్ అనే వ్యక్తి తెలిపాడు. గాలి వీచకుండానే.. ఎవరూ దరిదాపుల్లో లేనప్పుడు వాయువేగంతో ఊయల ఊగితే ఎలా ఉంటుందంటే.. గుండె ఆగిపోయినట్లుంది.. అలాంటిదే అక్కడ తాము చూశామని స్కాట్ తెలిపాడు. 
 
వార్విక్ ప్రాంతంలోని ఓ ప్లే గ్రౌండ్ దగ్గరకొచ్చినప్పుడు తన మూడేళ్ల కుమార్తె ఊయల ఊగుతానంటూ పట్టుబట్టింది. దీంతో ఆ ఊయల ఉన్న వైపు చూసిన స్కాట్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రాంతంలో ఎవరూ ఊపకుండానే, ఖాళీ ఊయల పూనకం వచ్చినట్టు ఊగిపోవడంతో తన పిల్లల్ని కారు కూడా దిగనీయలేదు. గుండెలు చిక్కబట్టుకుంటూ ఆ సన్నివేశాన్ని వీడియో తీశాడు. 
 
గాలి కూడా వీచని ప్రాంతంలో దెయ్యం లేకుండా ఖాళీగా ఉన్న ఊయల ఎలా ఊగుతుందని స్కాట్ తెలిపాడు. ఒక్కటి కాదు.. అక్కడ మరిన్ని దెయ్యాలు కూడా ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేశాడు. అంతేకాదు.. పిల్లలు వార్విక్ ప్రాంతానికి వెళ్ళొద్దని స్కాట్ చెప్పాడు. అంతేగాకుండా తాను తీసిన వీడియోను స్కాట్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఇప్పటికే 45 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. మీరూ ఓ లుక్కేయండి.