సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 11 నవంబరు 2017 (15:46 IST)

మోదీ భేష్.. భారత్ అత్యద్భుత ఆర్థిక విజయం సాధించింది: ట్రంప్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు. ఫిలిప్పైన్స్‌లో జరిగే ఇండోఆసియన్, ఈస్ట్ ఆసియా సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని మోడీ ఆదివారం బయలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు. ఫిలిప్పైన్స్‌లో జరిగే ఇండోఆసియన్, ఈస్ట్ ఆసియా సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని మోడీ ఆదివారం బయలుదేరుతారు. ట్రంప్ కూడా ఈస్ట్ ఆసియా సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా ట్రంప్ మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. 
 
భారతదేశం అత్యద్భుతమైన ఆర్థిక విజయం సాధించిందని ట్రంప్ కొనియాడారు. సంస్కరణల ప్రక్రియ, బహిరంగ ఆర్థిక వ్యవస్థతో దేశ ఆర్థిక ప్రగతి యాత్ర సాగుతోందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ప్రధాని మోడీ విస్తారిత దేశంలో ప్రజలందరిని ఒకేతాటిపైకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారని ట్రంప్ కొనియాడారు. 
 
వార్షిక ఆసియా పసిఫిక్ సహకార సదస్సు, సీఈఓల సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, ప్రత్యేకించి భారత్ ప్రగతిని ప్రస్తావించారు. ఇప్పటికే ఆసియా పసిఫిక్ ఆర్థిక కూటమి వెలుపలి దేశాలు కూడా గణనీయంగా కృషి చేస్తున్నాయని చెప్పారు.