భారత్‌లో మతస్వేచ్ఛ లేదు.. ముస్లిం, క్రైస్తవులపై దాడులు: అమెరికా
భారత్‌లో మతస్వేచ్ఛ కరువైందని అమెరికా సంచలన ప్రకటన చేసింది. క్రైస్తవులపై దాడులు పెరిగిపోతున్నాయని.. మతస్వేచ్ఛ కోసం ఐదు లక్షల డాలర్ల నిధులను అందజేయనున్నట్లు అమెరికా పేర్కొంది. ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీ
భారత్‌లో మతస్వేచ్ఛ కరువైందని అమెరికా సంచలన ప్రకటన చేసింది. క్రైస్తవులపై దాడులు పెరిగిపోతున్నాయని.. మతస్వేచ్ఛ కోసం ఐదు లక్షల డాలర్ల నిధులను అందజేయనున్నట్లు అమెరికా పేర్కొంది. ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడమ్ రిపోర్టు ప్రకారం శ్రీలంక, భారత దేశాల్లో మస్లింలు, క్రైస్తవులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అమెరికా ఆరోపించింది.
ఈ జాబితాలో భారత్‌కు స్థానం లేకున్నా భారత్‌కు నిధులు అందజేయాలని అమెరికా నిర్ణయించడం ఆశ్చర్యకరమైన అంశమని విశ్లేషకులు అంటున్నారు. ఈ జాబితాలో ఆఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, కజకిస్థాన్, కిర్గిస్థాన్, నేపాల్, పాకిస్తాన్, తజకిస్థాన్, తుర్కుమెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ తదితర దేశాలు ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్నాయి.
ఇక భారత్‌లో రిలిజియస్ ఫ్రీడమ్ కోసం ప్రభుత్వేతర సంస్థలకు అంటే ఎన్జీవోలకు ఈ నిధులను అందజేస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. దక్షిణ, మధ్య ఆసియా దేశాల్లో మానవహక్కుల ఉల్లంఘన, కార్మికుల రక్షణ తదితర 28 అంశాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు అమెరికా ప్రకటించింది.