ఆ వర్శిటీలో ప్రాక్టికల్ సబ్జెక్టుగా శృంగారం!?
నేటి యువతలో శృంగారంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అనేక మంది నిపుణులు వేదికలపై చెబుతుంటారు. ముఖ్యంగా, పాఠశాల స్థాయి నుంచే శృంగారంపై అవగాహన కల్పించేలా పాఠ్యాంశాలు ఉండాలని కోరుతున్నారు. కానీ, ఇది ఆచరణలో మాత్రం శూన్యంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ దేశంలోని డుర్హాం విశ్వవిద్యాలయం సంచలన నిర్ణయం తీసుకోనుంది. శృంగారంపై అపోహలను తొలగించడానికి దాన్నో ప్రాక్టికల్ సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని ఈ వర్శిటీకి చెందిన విద్యార్థి యూనియన్ చేసిన ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించింది.
అలాగే, డ్రగ్స్‌కు బానిసై తమకు తెలియకుండానే పడుపు వృత్తిలోకి దిగుతున్న విద్యార్థులకు మానసిక స్థైర్యాన్ని కల్పించేందుకు కాలేజీ సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
దీనిపై సానుకూలంగా స్పందించిన యూనివర్సిటీ యాజమాన్యం.. తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. విద్యార్థులకు మానసికంగా అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది.