శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (09:41 IST)

మూడో అంతస్థు నుంచి పడబోయిన చిన్నారిని పోలీసులు ఎలా పట్టుకున్నారంటే?

మూడో అంతస్థు నుంచి చిన్నారి కిందపడపోయాడు. ఓ అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తు నుంచి పడిపోయిన ఓ చిన్నారిని పోలీసులు క్యాచ్ పట్టుకుని కాపాడారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘట

మూడో అంతస్థు నుంచి చిన్నారి కిందపడపోయాడు. ఓ అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తు నుంచి పడిపోయిన ఓ చిన్నారిని పోలీసులు క్యాచ్ పట్టుకుని కాపాడారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఈ ఘటన ఈజిప్టులో చోటుచేసుకుంది. మూడో అంతస్తు బాల్కనీలో ఓ పిల్లాడు వేలాడుతున్నట్లు అక్కడే ఉన్న పోలీసులు గుర్తించారు. 
 
ఓ పోలీసు మూడో అంతస్తు ఎక్కి ఆ పిల్లాడిని రక్షించాడు. బిల్డింగ్ కింద వున్న మిగిలిన పోలీసులు ఆ పిల్లాడు కిందపడిపోతే క్యాచ్ పట్టుకోవాలని చూస్తున్నారు. అంతలోనే ఒక్కసారిగా ఆ చిన్నారి జారిపడిపోయారు. చివరకు ఓ పోలీసు ఆ పిల్లాడికి ఎలాంటి గాయాలు తగలకుండా క్యాచ్ పట్టాడు. దీంతో ఆ పిల్లాడు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.