గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2017 (09:47 IST)

'ప్రసవ' ఫోటోను ఫేస్‌బుక్‌లో పెట్టిన తైవాన్ మహిళ

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. కేవలం తమ విహార యాత్రలు, ఆలయాల సందర్శనలు, కుటుంబంలో జరిగే వివాహాదిశుభకార్యాలను మాత్రమేకాకుండా, పడక గదిలో జరిగే

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. కేవలం తమ విహార యాత్రలు, ఆలయాల సందర్శనలు, కుటుంబంలో జరిగే వివాహాదిశుభకార్యాలను మాత్రమేకాకుండా, పడక గదిలో జరిగే విషయాలను సైతం ఫోటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో‌ అప్‌లోడ్ చేస్తున్నారు. 
 
తాజాగా తైవాన్‌కు చెందిన ఓమహిళ తన ప్రసవాన్ని ఫోటో తీయించి దాన్ని ఫేస్‌బుక్‌లో పెట్టింది. ఈ వ్యవహారం తైవాన్‌లో సంచలనం రేపింది. డాక్టరైన లిన్ తుజూ హంగ్ అనే మహిళ పండంటి బిడ్డను ప్రసవించడాన్ని ఫోటో తీయించి దాన్ని 'ధైర్యవంతురాలైన సూపర్ మామ్ అందమైన శిశువును ప్రసవించింది...' అంటూ శీర్షికతో ఫేస్‌బుక్‌లో మరచిపోలేని మధుర క్షణాలంటూ పోస్టు చేసింది. 
 
ఈ ఫోటో అప్‌లోడ్ చేసిన కొన్ని క్షణాల్లోనే వైరల్ అయింది. దీన్ని గమనించిన ఫేస్‌బుక్ యాజమాన్యం.. అది అశ్లీల ఫోటో అంటూ తొలగించింది. నా మనసును దోచుకున్న ప్రసవం ఫోటోను తొలగించడంతో నిరాశ చెందిన సదరు తల్లి ఆ ఫోటోను మళ్లీ 'ఇన్‌స్టాగ్రామ్'లో పెట్టింది. ప్రసవ ఫోటోను పెట్టిన మహిళను తైవాన్ దేశ నెటిజన్లు అభినందించారు.